వారి పాత్రల్లో.. వీళ్లు జీవించారు!

నర్తకి.. సుధా చంద్రన్‌ జీవితం ఆధారంగా సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వంలో 1985లో ‘మయూరి’విడుదలైంది. ఈ సినిమాలో సుధా చంద్రన్‌ మయూరి పాత్రను పోషించింది. ఈ చిత్రానికి జాతీయ సినిమా అవార్డు, నంది అవార్డు వచ్చాయి.

image:instagram/sudhaachandran

అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శకుంతలా దేవి’ ప్రేక్షకులను అలరించింది. గణిత మేధావి అయిన శకుంతలా దేవి జీవిత చరిత్రను చిత్ర రూపంలో 2020లో ఓటీటీలో విడుదల చేశారు. శకుంతలా దేవి పాత్రను విద్యా బాలన్‌ పోషించారు. 

image:instagram/balanvidya

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా చేసుకుని.. వెబ్ సీరీస్‌ తీశారు. దీనికి గౌతమ్‌ వాసుదేవ్‌, ప్రసాద్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించారు. 

image:instagram/meramyakrishnan

ఎఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’కి విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది.

image:instagram/kanganaranaut

మహానటి సావిత్రి జీవితాన్ని ‘మహానటి’ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌.. తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాను పలు అవార్డులు కూడా వరించాయి.

image:instagram/keerthysureshofficial

‘మణికర్ణిక’తో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్‌ ఝాన్సీ రాణీ.. పాత్రలో ఒదిగిపోయింది.

image:instagram/kanganaranaut

బాక్సర్‌ క్రీడాకారిణి.. మేరీ కోమ్‌.. జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘మేరీ కోమ్‌’లో ప్రియాంకా చోప్రా నటించింది.

image:instagram/priyankachopra

వేశ్య వాటికల్లో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుపుతూ వాళ్లకు నాయకురాలిగా ఎదిగిన గంగూభాయ్‌.. జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. ‘ గంగూభాయ్‌.. కాఠియావాడి’లో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

image:instagram/aliaabhatt

అనుష్క శర్మ నటిస్తోన్న బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’. భారత మహిళా క్రికెటర్‌ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

image:instagram/anushkasharma

మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘శభాష్‌ మిథు’. ఈ సినిమాలో తాప్సీ నటించి మెప్పించింది. 

image:instagram/taapsee

కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమదేవి.. జీవిత గాథను గుణశేఖర్‌ తెరకెక్కించారు. ఇందులో రుద్రమదేవిగా.. అనుష్క నటించి మెప్పించింది.

image:instagram/rudhramadevi

పరిణీతి చోప్రా.. సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన.. ‘సైనా’లో నటించింది.

image:instagram/parineetichopra

కోవర్టుల ఎన్‌కౌంటర్లలో బలైన ఓ విప్లవకారురాలు.. జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. ‘విరాటపర్వం’ ఇందులో సాయిపల్లవి నటించింది. మంచి గుర్తింపు పొందింది.

image:instagram/saipallavi.senthamarai

కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. 'ఎమర్జెన్సీ' నాటి పరిస్థితులపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది.

image:instagram/kanganaranaut

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

Eenadu.net Home