వెండితెరపై క్రికెటర్ల జీవితం.. స్ఫూర్తిదాయకం
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’.ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా క్రికెటర్ల జీవితాధారంగా రూపొంది, స్ఫూర్తినింపిన సినిమాలు గుర్తు చేసుకుందాం..
ఇందులో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్ర పోషించారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహించారు. ఇది కేవలం క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రమని, రాజకీయ కోణాలేవీ కథలో లేవని చిత్ర బృందం స్పష్టం చేసింది.
రాంచీలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎం.ఎస్. ధోనీ.. టీమిండియా కెప్టెన్‌గా ఎదిగిన వైనాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రధాన పాత్రధారి: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, దర్శకుడు: నీరజ్ పాండే. ఓటీటీ ప్లాట్‌ఫామ్: ‘డిస్నీ+హాట్‌స్టార్’.
బాల్యంలో టెన్నిస్‌ను ఇష్టపడిన సచిన్ తెందూల్కర్ క్రికెట్‌కు ఎలా ఆకర్షితుడయ్యాడు? తదితర ఆసక్తికర అంశాలతో రూపొందింది. సచిన్ నటించడం విశేషం. డైరెక్టర్: జేమ్స్ ఎర్స్‌కైన్. ఓటీటీ: ‘సోనీలివ్’.
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ బయోపిక్ ఇది. అజహరుద్దీన్ బాల్యం, టీమిండియా సారథిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో చూడొచ్చు. నటుడు: ఇమ్రాన్ హష్మీ, దర్శకుడు: టోనీ డిసౌజా.
1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ సాధించడం, క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్ సింగ్. కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించారు. ఓటీటీ: ‘డిస్నీ+హాట్‌స్టార్’.
41 ఏళ్ల వయసులో టీ 20 లీగ్‌లో ఆడిన ప్లేయర్ ప్రవీణ్ తాంబే బయోపిక్ ఇది. ప్రధాన పాత్రధారి: శ్రేయాస్ తల్పడే, దర్శకత్వం: జయప్రద్. ఓటీటీ: ‘డిస్నీ+ హాట్‌స్టార్’.
దేశంలో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ బ్యాట్ పట్టడానికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణి మిథాలీరాజ్ బయోపిక్ ఇది. దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ, ప్రధాన పాత్రధారి: తాప్సి. ఓటీటీ: ‘నెట్‌ఫ్లిక్స్’.
ప్రపంచలోకెల్లా అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ జులన్ గోస్వామి జీవితంలోని ఆటుపోట్లు, విజయాల ఆధారంగా రూపొందిన చిత్రమిది. అనుష్క శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకుడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బయోపిక్ కూడా రానుంది. రెండేళ్ల క్రితమే ఈ సినిమా ప్రకటనా వెలువడినా ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. ఇందులో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరం.