ఇడ్లీ కోసమే మైసూర్ వెళ్లా!
‘డార్లింగ్’గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది నభా నటేష్. ‘నాగబంధం’, ‘స్వయంభూ’తో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలా పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకుంటూ.. సినిమాలతో బిజీగా ఉన్న ఈమె గురించి ఆసక్తికర విషయాలు..
ఆహారం విషయంలో నియమాలే ఉండవు. ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తింటేనే కడుపుతో పాటు మనసూ నిండుతుంది అని చెప్పింది.
ఓసారి కేవలం తట్టె ఇడ్లీ తినడానికే మైసూర్ వెళ్లిందట. ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్పెషల్ రెసిపీలను రుచి చూసేందుకు ట్రిప్స్ వేస్తుంది.
ఎలాంటి ఆహారం తీసుకున్నా జిమ్‌లో వర్కౌట్ తప్పనిసరి. వెయిట్‌లిఫ్టింగ్, హిట్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉంటుంది.
‘సమయానికి ఏది ఉన్నా లేకపోయినా కాఫీ ఉంటే చాలబ్బా.. పొద్దున్నే ఒక చుక్క కాఫీ పడనిదే అడుగు కూడా ముందుకు పడదు’ అని చెబుతోంది.
ట్రెడిషనల్, మోడ్రన్.. డ్రెస్సింగ్ స్టైల్ ఏదైనా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది నభా.. ఇన్‌స్టా ఖాతాకి 50లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
షూటింగ్ నుంచి విరామం దొరికితే పెయింటింగ్ చేస్తుంది. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పింది.
థియేటర్‌లో సినిమాలు చూడడం అంటే నభాకి ఇష్టం. ‘తమ్ముడితో కలిసి మల్టీప్లెక్స్‌కి వెళితే ఒక సినిమా చూసి ఇంటికి వచ్చిన సందర్భాలే లేవు..’ అంటోంది.