హ్యాపీ బర్త్‌డే నిధి..
‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ సరసన స్టెప్పులేసిన సుందరి నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తూ బిజీగా ఉంది. ఆగస్టు 17న ఈ బ్యూటీ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
(photos:instagram/nidhhiagerwal
హైదరాబాద్‌లో జన్మించిన నిధి.. పెరిగింది మాత్రం బెంగళూరులో. అక్కడే క్రిస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పట్టా అందుకుంది.
ఈ భామకి చిన్నప్పట్నుంచే క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. దాంతో కథక్‌లో కొన్నేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకుంది. అంతేకాకుండా బెల్లీడ్యాన్స్‌లోనూ నిధికి ప్రావీణ్యం ఉంది.
మోడలింగ్ చేస్తూ.. పలు బ్రాండ్స్ యాడ్స్‌లోనూ మెరిసిన నిధి.. మిస్ దివా యూనివర్స్‌లో(2014) పాల్గొన్న తర్వాతే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2017‘మున్నా మైఖేల్’అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.
నాగచైతన్య ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన తొలి సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నిధికి గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత చైతన్య సోదరుడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించింది. ఈ సినిమా మెప్పించకపోయినా.. నిధి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందానికి యూత్ ఫిదా అయింది.
ఇక పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’లో డాక్టర్ సారాగా నటించి ఆకట్టుకుంది. చిత్రం హిట్ అయినా.. ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు.
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా తెరంగేట్ర చిత్రం ‘హీరో’ చాలా కాలంగా వాయిదా పడుతూ 2022లో విడుదలైంది. ఇందులో నిధి హీరోయిన్‌గా నటించింది.
కోలీవుడ్‌లో ‘ఈశ్వరన్(2021)’తో ఎంట్రీ ఇచ్చి.. ‘భూమి’, ‘కలగ తలైవన్’లో నటించి అక్కడి ప్రేక్షకుల్ని మెప్పించింది.
సినిమాల్లోనే కాదు.. ‘ఉంగ్లిచ్ రింగ్ దాల్ దే’, ‘ఆహో! మిత్రాన్ ది యెస్ హై’, ‘సాత్ క్యా నిభావోగే’ మ్యూజిక్ వీడియోల్లోనూ మెరిసింది.
సినీ అవకాశాలు తక్కువగానే ఉన్నా ఈ బ్యూటీ సోషల్‌మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో తన గ్లామర్ ఫొటోలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.