హ్యాపీ బర్త్‌ డే.. గోవా బ్యూటీ!

‘దేవదాసు’తో వెండితెరపై మెరిసిన గోవా బ్యూటీ ఇలియానా.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. 

Image: Instagram/Ileana D'Cruz

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. నేడు ఆమె పుట్టిన రోజు. 

Image: Instagram/Ileana D'Cruz

ఇలియానా.. 1987 నవంబర్‌ 1న ముంబయిలో జన్మించింది. ఆ తర్వాత ఆమె కుటుంబం గోవాలో స్థిరపడింది. 

Image: Instagram/Ileana D'Cruz

This browser does not support the video element.

చదువుపూర్తయ్యాక ముంబయిలో సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే పలు బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/Ileana D'Cruz

‘దేవదాస్‌’ కంటే ముందు దర్శకుడు తేజ ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారట. కానీ, ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత వైవీఎస్‌ చౌదరీ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. 

Image: Instagram/Ileana D'Cruz

తొలి చిత్రమే బ్లాక్‌ బాస్టర్‌. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత మహేశ్‌బాబుకి జోడిగా ‘పోకిరి’లో నటించడంతో స్టార్‌డమ్‌ వచ్చేసింది.

Image: Instagram/Ileana D'Cruz

ఇప్పటి వరకు వివిధ భాషల్లో 25కిపైగా సినిమాల్లో నటించింది. అందులో 16 తెలుగు సినిమాలే. వాటిలో ‘రాఖీ’, ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’ వంటి హిట్‌ చిత్రాలున్నాయి. 

Image: Instagram/Ileana D'Cruz

This browser does not support the video element.

పూరి జగన్నాథ్‌-రవితేజ కాంబినేషన్‌లో 2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’లో నటించిన ఇలియానా.. మళ్లీ ఆరేళ్ల తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ(2018)’లో మెరిసింది.

Image: Instagram/Ileana D'Cruz

తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. పలు సినిమాల్లో నటించినా రాణించలేకపోతోంది.

Image: Instagram/Ileana D'Cruz

This browser does not support the video element.

ఈ నేపథ్యంలోనే ‘ప్రజల్లో పాపులారిటీ ఉంటేనే ఇక్కడ(చిత్ర పరిశ్రమలో)జీవితాన్ని కొనసాగించగలమని.. పాపులారిటీ తగ్గితే అవకాశాలు దొరకడం కూడా కష్టమే’నని ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. 

Image: Instagram/Ileana D'Cruz

ఒకప్పుడు జీరో సైజ్‌ నడుముతో ఆకట్టుకున్న ఈ భామ.. ఈ మధ్య కాస్త బరువు పెరిగింది. దీంతో ఇలియానా ఏంటి ఇలా మారిపోయిందని అభిమానులు అవాక్కయ్యారు. 

Image: Instagram/Ileana D'Cruz

This browser does not support the video element.

తన ఇన్‌స్టాల్లో మేకప్‌ లేకుండా ఉన్న ఫొటోలను కూడా ఎక్కువగా పోస్ట్‌ చేస్తుంటుంది. ఓ సందర్భంలో మేకప్‌ అంటే అందంగా ఉన్న మనల్ని మరింత అందంగా చూపించేందుకు ఉపయోగపడేదంటూ పేర్కొంది. 

Image: Instagram/Ileana D'Cruz

ఈ ‘భానుమతి’కి కోపం ఎక్కువేనట! ఏదైనా విషయాన్ని పదే పదే చెప్పాలంటే తనకు అసలు నచ్చదట.

Image: Instagram/Ileana D'Cruz

కాస్త సమయం దొరికిందంటే తన స్నేహితులతో షికారుకి వెళ్లేందుకు ఇష్టపడుతుంది. ఎక్కువ బీచ్‌లుండే ప్రాంతాలకు వెళ్తుంటుందీ బ్యూటీ.

Image: Instagram/Ileana D'Cruz

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

రవీనా టాండన్‌ వారసురాలు.. భలే చలాకీ!

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

Eenadu.net Home