చిన్న పేరు.. పెద్ద హిట్టు!

#Eenadu

ఆర్‌ఆర్‌ఆర్‌

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆస్కార్‌ బరిలో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 1,200కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

#Eenadu

పుష్ప

సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ మూవీ ఇది. ఉత్తరాదిలో సంచలనం సృష్టించిన ‘పుష్ప- ది రైజ్‌’.. దాదాపు రూ. 400కోట్లు వసూళ్లు చేసింది. దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్‌’ రాబోతోంది.

#Eenadu

కేజీఎఫ్‌ (1,2)

యష్‌ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించింది. రెండు పార్ట్‌లు కలిపి దాదాపు రూ. 1,500 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

#Eenadu

కాంతార

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఊహించని రీతిలో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ సాధించిందీ చిత్రం. దాదాపు రూ. 16 కోట్లతో రూపొందిన ‘కాంతార’.. సుమారు రూ.450కోట్లు రాబట్టింది.

#Eenadu

విక్రమ్‌

కమల్‌ హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’కు సంచలన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించాడు. రూ. 120 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. దాదాపు రూ.450 కోట్లు వసూళ్లు చేసి.. బంపర్‌ హిట్‌ అందుకుంది. 

#Eenadu

పఠాన్‌

చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో ‘పఠాన్‌’తో ఓ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ పడింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా దాదాపు రూ.240కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

#Eenadu

మరికొన్ని సినిమాలు కూడా ఇలా పొట్టి టైటిల్స్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#Eenadu

దసరా

ఏజెంట్‌

సలార్‌

కబ్జ

జవాన్‌

లియో

ఒ.జి

స్పిరిట్‌

డంకీ

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home