సోగ కళ్ల కాజోల్‌ @ 30 ఇయర్స్‌ 

 ‘బేఖుదీ’తో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజోల్‌ ఇటీవల 30 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది.

Source: Kajol/Instagram

షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌ లాంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో ఆడిపాడింది.

Source: Kajol/Instagram

 కాజోల్‌ 1974 ఆగస్టు 5న ముంబయిలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తల్లి తనూజ నటి, తండ్రి శోము ముఖర్జీ దర్శకనిర్మాత.

Source: Kajol/Instagram

స్కూల్‌ డేస్‌లోనే ‘బేఖుదీ’ (1992)తో ముఖానికి రంగేసుకుంది. అనంతరం చదువుకి స్వస్తి చెప్పి సినిమాల వైపు దృష్టి సారించింది.

Source: Kajol/Instagram

షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ల క్లాసిక్‌ లవ్‌ స్టోరీ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. 1995లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన మ్యాజిక్‌ తెలిసిందే.

Source: Kajol/Instagram

‘డీడీఎల్‌జే’ తర్వాత షారుఖ్‌ - కాజోల్‌ జోడీకి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో 10కి పైగా సినిమాలొచ్చాయి.

Source: Kajol/Instagram

 కాజోల్‌కు 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చాయి. 2011లో భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ పురస్కారంతో గౌరవించింది.

Source: Kajol/Instagram

 

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, కాజోల్ చాలా కాలం ప్రేమించుకుని 1999లో వివాహం చేసుకున్నారు. ‘గుండారాజ్‌’ చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందట.

Source: Kajol/Instagram

తమిళంలో ‘మిన్‌సారా కణవు’ (మెరుపు కలలు), ‘వీఐపీ 2’లో నటించిందీ ముద్దుగుమ్మ.

Source: Kajol/Instagram

కాజోల్ సోషల్ వర్కర్‌... ప్రథమ్, ది లూంబా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌ కూడా.

Source: Kajol/Instagram

సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషికిగాను ఐరాస ‘కరమ్‌వీర్ పుష్కర్’ అనే ప్రపంచ పౌర పురస్కారంతో సత్కరించింది.

Source: Kajol/Instagram

సైన్స్ - ఫిక్షన్, భయానక నవలలు చదవడం, రచనలు ఆమె హాబీలు. వ్యాయామం, డ్యాన్స్‌ చేయడమంటే తెగ ఇష్టం.

Source: Kajol/Instagram

కాజోల్‌కి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో 12.6 మిలియన్ల నెటిజన్లు అనుసరిస్తున్నారు.

Source: Kajol/Instagram

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు.. ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

Eenadu.net Home