‘రామాయణ’లో లారాదత్తా నటిస్తోందా..?

నితేష్‌ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో బాలీవుడ్‌ హీరోయిన్‌ లారా దత్తా నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.

రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. లారా దత్తా ఈ చిత్రంలో కైకేయి పాత్రలో కనిపించనుందన్న టాక్‌ నడిచింది.

దీనిపై లారా తాజాగా స్పందించింది. ‘అవి రూమర్సే అయినా.. చాలా సంతోషాన్నిస్తున్నాయి. ‘రామాయణ’లాంటి చిత్రంలో నటించాలని ఎవరికుండదు చెప్పండి?’ అని అంటోంది.

ఒకవేళ అవకాశం వస్తే శూర్పణఖ, మండోదరి, కైకేయి.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా సంతోషంగా చేస్తానంటూ సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం అవిషేక్‌ ఘోష్‌ దర్శకత్వంలో వస్తున్న ‘సూర్యాస్త్‌’తో పాటు ‘వెల్‌కమ్‌ టు ద జంగిల్‌’లోనూ లారా దత్తా నటిస్తోంది. ‘రానీతి’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంటోంది.

పరిశ్రమకి వచ్చి దాదాపు 11 ఏళ్లు అయినా లారాకు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు 40కి పైగా చిత్రాల్లో నటించింది.

ఇండియన్‌ మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతిని వివాహమాడిన లారాకు.. ఓ పాప ఉంది.

విహార యాత్రలంటే లారాదత్తాకు ఇష్టం. కుటుంబ సభ్యులతో కలిసి అలా ట్రిప్‌లకు వెళ్లిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పెడుతూ ఉంటుంది.

ఫిట్‌గా ఉండేందుకు నోరు కట్టేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడనంటోంది లారా. ఆహారం విషయంలో ఎలాంటి నియమమూ పెట్టుకోదట. నిత్యం యోగా, వ్యాయామమే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అంటోంది.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home