బాలీవుడ్‌ వారసత్వంలో

మరో ‘జంట’!

ఇప్పటికే ఎంతో మంది తారలు, ప్రముఖుల వారసులు బాలీవుడ్‌ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు అమ్రిన్‌ ఖురేషీ, నమషి చక్రవర్తి కూడా చేరారు. 

Image: Instagram/amrinqureshi

సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు నమషి చక్రవర్తి తొలి చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌’తోనే అమ్రిన్‌ కూడా తెరంగేట్రం చేస్తోంది. 

Image: Instagram/amrinqureshi

ఈమె.. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు సాజిద్‌ ఖురేషీ కుమార్తె. ‘బ్యాడ్‌ బాయ్‌’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత.

Image: Instagram/amrinqureshi

ఏప్రిల్‌ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీబిజీగా ఉంది అమ్రిన్‌.

Image: Instagram/amrinqureshi

ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి. వాటిలో అమ్రిన్‌.. ఎంతో అందంగా కనిపిస్తోందని సినీఅభిమానులు అంటున్నారు. 

Image: Instagram/amrinqureshi

This browser does not support the video element.

నిజానికి అమ్రిన్‌ హీరోయిన్‌ అవ్వాలని అనుకోలేదట. వ్యాపారవేత్త అవ్వాలని ప్రణాళికలు వేసుకుందట.

Image: Instagram/amrinqureshi

తండ్రి సాజిద్‌.. అమ్రిన్‌ను నటి అవ్వాలని కోరుకున్నారట. దీంతో ఆయన కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట. 

Image: Instagram/amrinqureshi

నటనలో శ్రీదేవి తనకు స్ఫూర్తి అని అమ్రిన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Image: Instagram/amrinqureshi

‘బ్యాడ్‌ బాయ్‌’ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరిగింది. దీంతో తిరిగి ముంబయి వెళ్లే క్రమంలో శ్రీదేవి సినిమాలు చాలా చూసిందట.

Image: Instagram/amrinqureshi

శ్రీదేవిని చూసే నటనలో, కథల ఎంపికలో మెళకువలు నేర్చుకున్నానని అంటోంది.

Image: Instagram/amrinqureshi

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home