టాలీవుడ్‌ వైపు బాలీవుడ్‌ తారల అడుగు!

జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌ 30వ చిత్రంలో జాన్వీ నటిస్తోంది. తాజాగా చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం కూడా జరిగింది.

Image: Instagram

దీపికా పదుకొణె

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె కూడా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్‌ - కె’లో హీరోయిన్‌గా మెరవనుంది. 

Image: Instagram

నర్గీస్‌ ఫక్రి

హిందీ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తోనే ఎక్కువగా ఆకట్టుకుంటోన్న నర్గీస్‌ ఫక్రి.. తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతోంది. పవన్‌కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’లో నర్గీస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 

Image: Instagram

మానుషి చిల్లర్‌

మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్‌ గతేడాది బాలీవుడ్‌లో ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’లో నటించింది. మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ 13వ చిత్రంలో ఈ భామ నటించడానికి సిద్ధమైంది.

Image: Instagram

అనన్య పాండే

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే తెలుగులో ‘లైగర్‌’లో నటించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైనా పెద్దగా ఆకట్టుకోలేపోయింది. 

Image: Instagram

ఆలియా భట్‌

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించింది. 

Image: Instagram

సయీ మంజ్రేకర్‌

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు మహేశ్‌ భట్‌ తనయ సయీ మంజ్రేకర్‌.. తెలుగులో ‘గని’తో తెరంగేట్రం చేసి.. ఆ వెంటనే ‘మేజర్‌’లోనూ నటించింది.

Image: Instagram

శ్రద్ధా కపూర్‌

బాలీవుడ్‌లో ‘ఆషిఖీ 2’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్‌.. ప్రభాస్‌ ‘సాహో’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram

కియారా అడ్వాణీ

బీటౌన్‌ క్రేజీ హీరోయిన్‌ కియారా అడ్వాణీ.. 2018లోనే మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో ఆడిపాడింది. ప్రస్తుతం మళ్లీ చరణ్‌తో కలిసి శంకర్‌ తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌సీ 15’లో నటిస్తోంది. 

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home