బోర్డర్‌-గావస్కర్‌ టోర్నీ సాగిందిలా..!

తొలి టెస్ట్‌ మ్యాచ్‌: ఫిబ్రవరి 9 - 11

నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్సింగ్స్‌లో 177 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 400 పరుగులు(ఆలౌట్‌) సాధించింది.

Image: Twitter

తొలి టెస్ట్‌ మ్యాచ్‌:

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ ఇన్నింగ్స్‌(132 పరుగులు) తేడాతో గెలుపొందింది.

Image: Twitter

తొలి టెస్ట్‌ మ్యాచ్‌:

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవీంద్ర జడేజా ( 7 వికెట్లు, 70 పరుగులు)

Image: Twitter

రెండో టెస్ట్‌ మ్యాచ్‌: ఫిబ్రవరి 17 - 19

దిల్లీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్సింగ్స్‌లో 263 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత భారత్‌ బరిలోకి దిగి తొలి ఇన్సింగ్స్‌లో 262 పరుగులు(ఆలౌట్‌) మాత్రమే చేయగలిగింది.

Image: Twitter

రెండో టెస్ట్‌ మ్యాచ్‌:

రెండో ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ 113 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 118/4 స్కోర్‌ చేసి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Image: Twitter

రెండో టెస్ట్‌ మ్యాచ్‌:

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవీంద్ర జడేజా (10 వికెట్లు.. 26 పరుగులు)

Image: Twitter

మూడో టెస్ట్‌ మ్యాచ్‌: మార్చి 1 - 3

ఇందౌర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకొని.. 109 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఆసీస్‌ తొలి ఇన్సింగ్స్‌ 197 పరుగులు(ఆలౌట్‌) చేసింది.

Image: Twitter

మూడో టెస్ట్‌ మ్యాచ్‌:

రెండో ఇన్సింగ్‌లో భారత్‌.. 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఆసీస్‌ 78/1 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.

Image: Twitter

మూడో టెస్ట్‌ మ్యాచ్‌:

మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌: నాథన్‌ లైయన్‌ ( 11 వికెట్లు)

Image: Twitter

నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌: మార్చి 9 - 13

టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ 480(ఆలౌట్‌) స్కోరు చేయగా.. భారత్‌ 571 పరుగులు సాధించింది. 

Image: Twitter

నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌:

రెండో ఇన్సింగ్స్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆసీస్‌ 175/2 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. భారత్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

Image: Twitter

నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌:

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: విరాట్‌ కోహ్లీ (186 పరుగులు).

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home