మన నిఖత్‌ ‘బంగారం’ 

తెలుగమ్మాయి.. ప్రపంచ మహిళ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ కామన్వెల్త్‌లో సత్తా చాటింది.

Image:Instagram/nikhat zareen

48-50 కేజీల (లైట్‌ ఫ్లై) బాక్సింగ్‌ విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై గెలుపొంది స్వర్ణ పతకం సాధించింది.

Image:Instagram/nikhat zareen

2022 మే నెలలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ విజేతగా నిలిచిన నిఖత్‌.. తాజాగా మరో గొప్ప విజయాన్ని అందుకొని దేశం గర్వించేలా చేసింది.

Image:Instagram/nikhat zareen

జూనియర్‌ స్థాయి నుంచే అనేక విజయాలను నిఖత్‌ తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది. Image:Instagram/nikhat zareen


టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకుంది. 2014 నేషన్స్‌ కప్‌, 2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో అదరగొట్టింది.

Image:Instagram/nikhat zareen


2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం దక్కగా.. 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణ పతకం సాధించింది.

Image:Instagram/nikhat zareen


2019 థాయ్‌లాండ్‌ ఓపెన్లో రజతంతో సరిపెట్టుకుంది. 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి పతకాలు అందుకుంది.

Image:Instagram/nikhat zareen


నిఖత్‌ వ్యక్తిగత విషయాలకొస్తే.. ఆమె 1996 జూన్‌ 14న నిజామాబాద్‌లో జన్మించింది. తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్‌ నేర్చుకుంది.

Image:Instagram/nikhat zareen


నిఖత్‌కు మెరుగైన శిక్షణ ఇప్పించాలని ఆమె కుటుంబమంతా నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది.

Image:Instagram/nikhat zareen


నిఖత్‌ బాక్సింగ్‌ రింగులోనే కాదు.. సోషల్‌మీడియాలోనూ చాలా యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తుంటుంది.

Image:Instagram/nikhat zareen

నిఖత్‌ బాక్సింగ్‌ రింగులోనే కాదు.. సోషల్‌మీడియాలోనూ చాలా యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తుంటుంది.నాలుగు నెలల కిందట నిఖత్‌కు ఇన్‌స్టాలో 70వేల మంది ఫాలోవర్స్‌ ఉండగా.. ప్రస్తుతం ఆమెను 1.29లక్షల మంది ఫాలో అవుతున్నారు.

Image:Instagram/nikhat zareen


IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home