యూకే ఫిల్మ్ స్కూల్‌లో పాఠంగా ‘భ్రమయుగం’.. ప్రత్యేకతలివే!
యూకే ఫిల్మ్ స్కూల్ పాఠ్యాంశాల్లో చోటు దక్కించుకుని రికార్డు సృష్టించింది ‘భ్రమయుగం’.
మమ్ముట్టి కీలక పాత్రలో రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పూర్తి సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో తీర్చిదిద్దడం విశేషం.
సౌండ్ డిజైన్‌పై యూకే ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు కేస్ స్టడీ ‘భ్రమయుగం’ ప్రదర్శిస్తారు.
హాలీవుడ్ ‘హారీ పోటర్’ సిరీస్ చిత్రాలతో ఈ సినిమాని పోలుస్తూ పాఠాలు చెప్పనున్నారు.
‘కుడుమోన్ పొట్టి’ (మమ్ముట్టి) థీమ్‌ను ప్లాస్టిక్ బకెట్ ఉపయోగించి క్రియేట్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టోఫర్ గిటార్ స్ట్రింగ్స్‌ను ఓపెన్ బకెట్‌కు బిగించి, ఆ సౌండ్‌ను రూపొందించాడు.
ఈ సినిమాలోని అత్యధిక సన్నివేశాలను నిజమైన వర్షంలోనే తీశారు.
మమ్ముట్టికి ప్రత్యేకంగా తయారు చేసిన పళ్లను పెట్టారు. అవి ఉంటే, తినడం సాధ్యమయ్యేది కాదు.
భవంతి చుట్టూ కనిపించే గడ్డిని 3వేల సంచుల్లో పెంచారు. అందుకు 4నెలలు పట్టింది.
రూ.27 కోట్లతో రూపొందించిన ఈ మూవీ ఫుల్‌రన్‌లో రూ.85 కోట్లకు పైగా వసూలు చేసింది.
సోనీలివ్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.