టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా? మరి ముందస్తు ప్రణాళిక ఉందా?

విహారయాత్రలకు వెళ్లిన‌ప్పుడు ఎప్పుడూ మ‌నం అనుకున్నంత బ‌డ్జెట్లోనే పనుల అయిపోవు. అందువల్ల మ‌నం వెళ్లే ప్రాంతాల‌ను బ‌ట్టి బ‌డ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటే ఖర్చులను నియంత్రించుకోవచ్చు.

Image: Eenadu

టూర్‌ బడ్జెట్.. మన పెట్టుబ‌డులు, పొదుపుల‌పై భారం కాకూడదు. అందుకే, కొన్ని నెలల ముందునుంచే ట్రావెల్‌ ఫండ్‌ కోసం మీ నెల‌వారీ ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించాలి.

Image: Eenadu

మంచి డీల్స్‌, డిస్కౌంట్స్‌, ఆఫ‌ర్స్‌ ఉన్నప్పుడు లేదా పర్యాటకుల రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఖర్చు తక్కువగా అవుతుంది.. డబ్బులు ఆదా అవుతాయి.

Image: Eenadu

 అంత‌ర్జాతీయ టూర్‌ ప్లాన్ చేస్తుంటే, ట్రావెల్ క‌రెన్సీని ముందుగానే కొనుగోలు చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే విప‌రీత‌మైన మార‌క‌పు ధ‌ర‌ల‌ను వ‌సూలు చేసే ఫారిన్ ఎక్స్ఛేంజీ బ్యూరోలతో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. 

Image: Eenadu

ప్ర‌యాణానికి ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్‌ను ఉప‌యోగించ‌డం మంచిది. ఇది మార‌క‌పు విలువల హెచ్చుత‌గ్గుల నుంచి మీ బడ్జెట్‌ను కాపాడుతుంది. క్రెడిట్‌, డెబిట్ కార్డులు, ట్రావెల‌ర్స్ చెక్‌లు, న‌గ‌దు వంటి వివిధ మార్గాల ద్వారా ఖ‌ర్చును విభ‌జించ‌డం మంచిది.

Image: Eenadu

ప్ర‌యాణాల్లో క్రెడిట్ కార్డ్‌ల మీద‌ అనేక రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉంటే మీ ట్రిప్ బుక్ చేసేట‌ప్పుడు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం మంచిది.

Image: Eenadu

మీ ప్ర‌యాణానికి త‌గినంత డ‌బ్బు స‌ర్దుబాటు అవ్వ‌క‌పోతే ఖ‌ర్చులకు గానూ వ్య‌క్తిగ‌త రుణాన్ని కూడా తీసుకోవ‌చ్చు. అయితే ఇటువంటి వ్య‌క్తిగ‌త రుణాలు సాధార‌ణంగా అధిక వ‌డ్డీ రేట్ల‌ను క‌లిగి ఉంటాయి.

Image: Eenadu

వీలైనంత వరకు వ్యక్తిగత రుణం తీసుకోవడం కంటే యాత్రల కోసం ముందుగానే పొదుపు ఆరంభించడం మంచిది.

Image: Eenadu

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home