ఫాస్టెస్ట్‌ 150 వికెట్స్‌.. 

తొలి భారత పేసర్‌ బుమ్రా

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు. 

టెస్టుల్లో వేగంగా 150+ వికెట్లు తీసిన భారత పేస్‌ బౌలర్‌గా నిలిచాడు.

భారత్‌ నుంచి అశ్విన్‌ టాపర్‌. అతడు 29 మ్యాచుల్లోనే 150 వికెట్లు పడగొట్టాడు. 

అనిల్ కుంబ్లే, ఎర్రాపల్లి ప్రసన్నతో కలిపి బుమ్రా మూడో స్థానంలో(34 మ్యాచుల్లో) నిలిచాడు. అశ్విన్ (29), రవీంద్ర జడేజా (32 మ్యాచ్‌లు) ముందున్నారు.

 టెస్టుల్లో 150+ వికెట్ల కంటే ఎక్కువ తీసిన వారిలో.. అతి తక్కువ సగటుతో బౌలింగ్‌ చేసిన రెండో బౌలర్‌ బుమ్రా (20.28) కావడం విశేషం. భారత్‌ నుంచి తొలి బౌలర్‌గా నిలిచాడు. 

భారత్‌ తరఫున అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌. కేవలం 6,781 బంతుల్లోనే పడగొట్టాడు. ఆ తర్వాత ఉమేశ్‌ యాదవ్ (7,661 బంతులు) ఉన్నాడు.

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు బుమ్రా ఔట్ చేశాడు.

ఇంగ్లాండ్‌ సూపర్‌ ప్లేయర్‌ జో రూట్‌పైనా బుమ్రా ఆధిపత్యం ప్రదర్శించాడు. మొత్తం 20 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు పెవిలియన్‌కు పంపాడు. 

టెస్టుల్లో బుమ్రాకి ఇది మూడో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు. ఇంగ్లాండ్‌పై 6/45 నమోదు చేశాడు.

ఔట్‌లో ఎన్ని రకాలో..!

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

Eenadu.net Home