కేథరిన్‌.. అందం అదిరెన్‌ 

ఇటీవల ‘బింబిసార’తో కెరీర్‌లోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది నటి కేథరిన్‌. ఇందులో ఆమె ఐరా పాత్రలో నటించింది.

Image:Instagram

ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే విహార యాత్ర కోసం ఇండోనేషియాలోని బాలీకి వెళ్లింది. Image:Instagram

కేథరిన్‌ 1989 సెప్టెంబరు 10న యూఏఈలోని దుబాయ్‌లో జన్మించింది.

Image:Instagram

దుబాయ్‌లోనే 12వ తరగతి వరకు చదివిన కేథరిన్‌.. అనంతరం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు షిప్ట్‌ అయింది.

Image:Instagram

‘చమ్మక్‌ చల్లో’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఇప్పటివరకు 25కిపైగా చిత్రాల్లో నటించింది.

Image:Instagram 

‘ఇద్దరమ్మాయిలతో..’లో ఆకాంక్షగా మెప్పించి.. తన ఒయ్యారాలతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

Image:Instagram

అనంతరం ‘పైసా’, ‘ఎర్రబస్సు’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘సరైనోడు’లో ‘ఎమ్మెల్యే’గా అలరించింది.

Image:Instagram

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’లో ‘ఏ ఫర్‌ ఆపిల్‌’ అనే స్పెషల్‌ సాంగ్‌తో సందడి చేసింది.

Image:Instagram

 ‘వరల్డ్ ఫేమస్‌ లవర్‌’లో స్మితగా కనిపించిన ఈ బ్యూటీ.. ‘మాచర్ల నియోజకవర్గం’లోనూ నటించింది. Image:Instagram

‘ప్రేమని నమ్ముతాను. కానీ దాని గురించి చెప్పడం కష్టం. అది ఒక మంచి ఫీల్‌ గుడ్‌ ఎమోషన్‌ అని నా ఫీలింగ్‌’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

Image:Instagram

కేథరిన్‌ మంచి డ్యాన్సర్‌, సింగర్‌. ఈమెకి ఐస్‌ స్కేటింగ్‌ కూడా వచ్చు.

Image:Instagram

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home