యాక్షన్ థ్రిల్లర్‌లో కేథరిన్..
కేథరిన్ థ్రెసా.. అదేనండి మన‘సరైనోడు’ MLA. ఈ మధ్య కాస్త జోరు తగ్గించిన ఈ భామ... ఇప్పుడు ఓ యాక్షన్ థ్రిల్లర్‌తో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
image: instagram/catherintresa
‘జార్జి రెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో కేథరిన్‌ను నాయికగా ఎంచుకున్నారు. అశోక్ తేజ దర్శకుడు.
image: instagram/catherintresa
కేథరిన్ పూర్తి పేరు కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్. 1989లో దుబాయిలో పుట్టింది. చదువంతా బెంగళూరులో సాగింది.
image: instagram/catherintresa
యాక్టింగ్ మీదున్న ఇష్టంతో... తొలుత మోడలింగ్‌తో కెరియర్ మొదలు పెట్టింది. తర్వాత 2010లో కన్నడలో ‘శంకర్ IPS’తో నటనలోకి అడుగు పెట్టింది.
image: instagram/catherintresa
టాలీవుడ్‌లో 2013లో ‘చమ్మక్ చల్లో’తో ఎంట్రీ ఇచ్చి ‘ఇద్దరమ్మాయిలతో’ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ‘పైసా’, ‘ఎర్రబస్సు’, ‘రుద్రమదేవి’, ‘గౌతమ్‌నంద’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
image: instagram/catherintresa
‘సరైనోడు’లో అల్లు అర్జున్ సరసన క్లాస్ + మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమాతో ‘లవ్‌లీ ఏంజెల్’గా ఫేమసయ్యింది.
image: instagram/catherintresa
ఆ తర్వాత వివిధ సినిమాల్లో ఐటమ్ పాటల్లో ఆకట్టుకుంది. ‘మాచర్ల నియోజకవర్గం’, ‘భళాతందనాన’, ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రలు పోషించింది.
image: instagram/catherintresa
కేథరిన్‌కు పెంపుడు జంతువులు అంటే ఇష్టమట. మోడ్రన్ డ్రెస్సులు ఫొటోషూట్‌లు చేయటమన్నా ఇష్టమే. ఆమె సోషల్ మీడియాలో ఇవే
ఎక్కువ.
image: instagram/catherintresa
షూటింగ్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా ఏవైనా కొత్త ప్రాంతాలు చూసేందుకు ట్రిప్పులు ప్లాన్ చేస్తుందంట. డ్యాన్స్ చేయటం, సినిమాలు చూడటంతో పని ఒత్తిడిని మరిచిపోవచ్చంటుంది ఈ సుందరి.
image: instagram/catherintresa
This browser does not support the video element.
వర్కౌట్స్ చేస్తూ శరీరాన్ని ఎంత శ్రమ పెడితే అంత ఫిట్‌గా ఉండొచ్చు అని చెబుతుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
image: instagram/catherintresa