మియా మ్యాజిక్‌... సెలబ్రిటీలు ఫిదా

టీమ్ఇండియాకు కంగ్రాట్స్‌. శ్రీలంక క్రికెట్‌కు కష్టమైన రోజు. సిరాజ్‌ ముందుండి బౌలింగ్‌ స్పెల్‌ను నడిపించాడు. ఇంతకంటే స్పైసీ స్పెల్ మరొకటి ఉండదు

- సచిన్‌

కేవలం 21 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగియడం గమనార్హం. సిరాజ్‌ అద్భుతమైన బౌలింగ్‌ వేశాడు. సరైన సమయంలో భారత్‌ ఫామ్‌ అందుకొంది. ఆసియా కప్‌ సాధించిన జట్టుకు శుభాకాంక్షలు

- సెహ్వాగ్

పవర్‌ఫుల్‌ విక్టరీ. సిరాజ్‌ నుంచి సూపర్ స్పెల్‌

- హర్భజన్ సింగ్

మియా అదరగొట్టేశావ్‌. ఏంటి విషయం? 

- అనుష్క శర్మ

శ్రీలంక ఆటగాళ్లు బాగానే ఆడి ఉండేవాళ్లు కానీ.. సిరాజ్‌ వారిని తప్పులు చేసే స్థితికి నెట్టేశాడు. అత్యున్నత స్థాయి బౌలింగ్‌ ప్రదర్శన

- ఇర్ఫాన్ పఠాన్

విజేతగా నిలిపే అద్భుతమైన స్పెల్‌ విసిరావు. ఛాపింయన్‌గా మార్చావు

- ప్రజ్ఞాన్ ఓజా

మ్యాచ్‌ త్వరగా ముగిసింది. ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో మనం ఏమి చేయాలని సిరాజ్‌ని అడగండి

- శ్రద్ధా కపూర్

శ్రీలంక ఎందులోనూ భారత్‌కు సరితూగలేదు. సిరాజ్‌ నీ బౌలింగ్‌తోపాటు మ్యాచ్‌ కలకాలం నిలిచిపోతుంది

- దినేశ్‌ కార్తిక్

సిరాజ్‌ మియా.. ఆసియా కప్ ఫైనల్‌లో మా టోలిచౌకీ కుర్రాడు ఆరు వికెట్లతో అదరగొట్టాడు. బౌలింగ్‌ వేసి కూడా లాంగ్‌ బౌండరీ వైపు పరిగెత్తిన విధానం అద్భుతం

- ఎస్.ఎస్.రాజమౌళి

బౌల్డ్‌ ఓవర్‌. సిరాజ్‌ సూపర్‌ స్పెల్. ఆసియా కప్‌ విజేతగా నిలిచిన భారత్‌కు శుభాకాంక్షలు

- మహేశ్‌ బాబు

ఓకే గూగుల్‌... సిరాజ్‌ ప్లే చేయ్‌. సారీ సిరాజ్‌ బౌలింగ్‌లో అడలేం!

- వసీమ్ జాఫర్

భారత్‌కు ఇంతకంటే మించిన విజయం మరొకటి ఉండదు. సిరాజ్‌ బౌలింగ్‌ దెబ్బకు లంక కుదేలైపోయింది

- రాబిన్ ఉతప్ప

 భారత్‌కు అద్భుతమైన విజయం. వరల్డ్ కప్‌ ముందు ఇలాంటి గెలుపు మరింత ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సిరాజ్‌ ఇవాళ చెలరేగిపోయావు

- యూసఫ్‌ పఠాన్

శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌పై విరుచుకుపడ్డాడు. విధ్వంసం సృష్టించాడు

- షోయబ్ అక్తర్

బిహార్‌ పోలీస్‌ స్పెషల్ ట్వీట్

హైదరాబాదీ భాషలో చెప్పాలంటే.. ఈ కుర్రాడు శ్రీలంకను ఓ ఆటాడేసుకున్నాడు

- అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌ ఎంపీ

టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే!

ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టిన వారి జాబితా ఇదే!

పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు

Eenadu.net Home