పొట్టి రోబో.. స్మార్ట్‌ పూల్‌ క్లీనర్‌.. ఏఐ ఫ్రిజ్‌

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ సందడి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (CES) లాస్ వెగాస్‌లో జరుగుతోంది. ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఆసక్తికర గ్యాడ్జెట్స్‌ ఇవీ..

కొత్త కాఫీ మెషీన్‌

కాఫీ వెండింగ్‌ మెషీన్లు మీరు చాలా చూసి ఉంటారు. ఎల్‌జీ తయారు చేసిన ఈ డ్యూయోబో కాఫీ మెషీన్‌ చాలా డిఫరెంట్‌. దీంతో ఒకేసారి రెండు రుచుల మిశ్రమంతో కాఫీని సిద్ధం చేయొచ్చు. 

ఇది పొక్లెయినర్‌

నిర్మాణ పనులు జరిగినప్పుడు పొక్లెయినర్లను చూసే ఉంటారు. ఇది కూడా అలాంటిదే. అయితే మొత్తం ఎలక్ట్రిక్‌ స్టైల్‌లో పని చేస్తుంది. హ్యూందాయ్‌ దీనిని రూపొందించింది.

హైటెక్‌ కార్‌

కార్ల రంగం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. అలా ఎల్‌జీ రూపొందించిన కొత్త కారు ఇది. ఈ ‘ఎల్‌జీ ఆల్ఫా’ కారులో అత్యున్నత సాంకేతికత ఉంటుందట. 

ఈ- ఛార్జింగ్‌

విద్యుత్తు కార్లకు ఛార్జింజ్‌ చేసే స్టేషన్‌ను మరింత ఆధునీకరిస్తూ ఎల్‌జీ రూపొందించిన ఈ-సెంట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఇదీ.

మొక్కల పెంపకం

ఇళ్లలో మొక్కలు పెంచడం ఇప్పుడు కొత్త హాబీ. దీని కోసం ఎల్‌జీ ‘టియున్‌’ అనే మినీ ఇండోర్‌ గార్డెనింగ్‌ అప్లియెన్స్‌ను తీసుకొచ్చింది. 

పొట్టి రోబో

ఈ రోబో సైజ్‌ చిన్నగా ఉండొచ్చు కానీ పనితనం మాత్రం అదిరిపోతుంది అంటోంది శాంసంగ్‌. ఈ రోబో పేరు బాలీ.

ఈత కొలను కోసం

స్విమ్మింగ్‌ పూల్స్‌ను శుభ్రం చేయడానికి సూబ్లూ అనే సంస్థ ఈ క్లీనర్‌ను రూపొందించింది. నీటి పరిస్థితిని పసిగట్టి ఈ రోబో శుభ్రం చేస్తుందట. 

ఏఐ రిఫ్రిజిరేటర్‌

శాంసంగ్‌ ఆవిష్కరించిన బెస్పోక్‌ ఏఐ ఫ్యామిలీ హబ్‌ రిఫ్రిజిరేటర్‌ ఇది. ఇందులో ఏఐ కెమెరాలు అమర్చడం వల్ల లోపల పెట్టిన ఆహార పదార్థాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఫ్రిజ్‌ డోర్‌కి ఉన్న స్క్రీన్‌పై కనిపిస్తాయి. 

ఫోన్‌కి ఎడిక్ట్‌ అయ్యారా.. ఇలా దూరం పెట్టండి!

సైబర్‌ దొంగలకు చిక్కకుండా ఉండేందుకు ఇవి పాటించండి

షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

Eenadu.net Home