ట్రాన్స్‌పరెంట్‌ టీవీ.. ఏఐ బూత్‌.. స్మార్ట్‌ లాక్‌

ఏటా జరిగే టెక్‌ సందడి.. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (CES) మొదలైంది. లాస్ వెగాస్‌లో 9 నుంచి 14 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు ప్రదర్శించిన ఆసక్తికర గ్యాడ్జెట్స్‌ ఇవీ.

ఎలక్ట్రిక్‌ స్కీ

ఈ వాహనం లాంటి పరికరం పేరు ఎస్‌కేడబ్ల్యూ వీల్ స్కీ. విద్యుత్తు ఆధారంగా పని చేసే దీంతో రోడ్లపై ఎంచక్కా రయ్యిన దూసుకుపోవచ్చు.

సైలెంట్‌ మాస్క్

ఈ స్కైటెడ్‌ సైలెంట్‌ మాస్క్‌ పెట్టుకుని ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేయొచ్చు. మొబైల్‌కు బ్లూటూత్‌తో అనుసంధానం చేసుకుంటే సరి.

స్మార్ట్‌గా ఛార్జింగ్‌

విద్యుత్తు, హైబ్రిడ్‌ వాహనాలను స్మార్ట్‌గా ఛార్జింగ్‌ చేసుకునే సాకెట్‌ ఇది. స్పార్క్‌లిన్‌ సంస్థ రూపొందించిన దీని పేరు స్పార్క్‌ 1. 

జంతు నేస్తం

పెంపుడు జంతువులకు ఆహారం పెట్టడానికి, వైద్య అవసరాల కోసం ఈ రోబోను తయారు చేశారు. ORo సంస్థకు చెందిన ఈ రోబో పెట్స్‌ను పరిశీలిస్తూ అప్‌డేట్స్‌ ఇస్తుంది.

హాప్టిక్‌ సెట్‌

ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) సాంకేతికత ఆధారంగా పని చేసే హెడ్‌ సెట్‌ ఇది. హెడ్‌ కదలికల ఆధారంగా సెట్‌లో హాప్టిక్స్‌ వస్తూ ఉంటాయి. 

ట్రాన్స్‌పరెంట్‌ టీవీ

ఇటు వైపు నుంచి చూస్తే అటువైపు ఏమున్నాయో తెలిసే అద్దాలు చూసుంటారు. అలాంటి టీవీని ఇప్పుడు ఎల్‌జీ తయారు చేసింది. దీని పేరు ఎల్‌జీ సిగ్నేచర్‌ ఓఎల్‌ఈడీ టీవీ. 

స్మార్ట్‌ లాక్‌

డోర్‌కి వేసే తాళాలు ఈ మధ్య కాలంలో చాలా తెలివిగా మారుతున్నాయి. దానికి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికతను జోడించి లాకీలీ విసేజ్‌ సరికొత్త లాక్‌ను తీసుకొచ్చింది. 

ఏఐ బూత్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న మాయలు అన్నీ ఇన్నీ కాదు. పై ఫొటోలో ఉన్నదీ అదే. ఏఐతో పని చేసే వీహెడ్‌ బూత్‌ ఇది. మెషీన్‌తో మాట్లాడినా మనిషితో మాట్లాడినట్లే ఉంటుంది. 

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home