చాందిని.. చక్కదనాల బొమ్మ!

లఘు చిత్రాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.. ఈ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి. ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ వంటి షార్ట్‌ ఫిలిమ్స్‌తో ఈ భామ మంచి గుర్తింపు దక్కించుకుంది.

Image:Instagram

ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన ‘ఝూన్సీ’ వెబ్‌సిరీస్‌లో స్క్రీన్‌పై తక్కువ సేపే కనిపించినా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Image:Instagram

హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 1991 అక్టోబరు 23న విశాఖపట్నంలో జన్మించింది. బెంగళూరులో మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది.

Image:Instagram

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ప్రేమ ఇష్క్ కాదల్'లో చిన్న పాత్రలు పోషించింది.

Image:Instagram 

2018లో వచ్చిన ‘మను’లో విభిన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

Image:Instagram

'కేటుగాడు'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యింది.

Image:Instagram

2020లో సుహాస్ సరసన 'కలర్ ఫోటో'లో నటించింది. తన నటనతో కుర్రకారు హృదయాలను గెలుచుకుంది. Image:Instagram

పలు కారణాల వల్ల తన మొదటి సినిమా కోసం ఏడాది ఎదురు చూసిందట! చివరికి ఆ సినిమా తీయలేదని, దాని కోసం వేచి చూస్తూ మంచి సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Image:Instagram  

మంచి నటి మాత్రమే కాదీమె..త్రో బాల్ ఆటలోనూ స్టేట్‌ ఛాంపియన్‌ కూడా.

Image:Instagram

ఈ బ్యూటీ సినిమాల్లో నటించాలనే కోరికతో గ్లిసరిన్‌ లేకుండా ఏడవటం కూడా ప్రాక్టీస్‌ చేసిందట! అది తనకు 'కలర్‌ఫోటో'లో సహజంగా నటించేందుకు ఉపయోగపడిందట!

Image:Instagram

కథలు రాయడం చాందినికి చాలా ఇష్టం! తనకు డైరెక్షన్ చేయాలన్న కోరిక కూడా ఉన్నట్లు ఓ ఇంటర్య్వూలో చెప్పింది.

Image:Instagram

రజినీకాంత్‌ తన అభిమాన నటుడు. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఉందంటూ ఓ సందర్భంలో తన మనసులో మాటను బయటపెట్టింది చాందిని.

Image:Instagram

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home