యూఎస్‌ రేడియోలో చంద్రికా రవి టాక్‌ షో

చంద్రికా రవి.. ఇటీవల ‘వీరసింహారెడ్డి’లోని ఓ పాటలో బాలకృష్ణతో ఆడిపాడి.. టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఈమె అమెరికాలోని పాపులర్‌ రేడియోలో ఓ టాక్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

‘ది చంద్రికా రవి షో’ పేరుతో ఈ షోను నిర్వహిస్తోంది. ఇది రుకుస్‌ ఎవెన్యూ రేడియోతో పాటు అమెరికాలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఉన్న ఐహార్ట్‌ రేడియోలోనూ ప్రసారమవుతోంది. 

ఇలా అమెరికాలో ఓ రేడియోలో టాక్‌ షోను నిర్వహిస్తోన్న తొలి భారతీయ మూలాలున్న మహిళగా చంద్రికా రవి రికార్డు సృష్టించింది. తన అనుభవాలను ప్రపంచానికి చెప్పడానికి సరైన వేదిక లభించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. 

ఈ షో.. అమెరికాలో ప్రతి గురువారం (భారతీయ కాలమానంలో గురువారం ఉదయం 7.30 గంటలకు) ప్రసారం కానుంది. అంతర్జాతీయ శ్రోతల కోసం ఈ షోను ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేస్తారు.

‘నా కెరీర్ మలుపు తిరిగేందుకు ఇదో గొప్ప అవకాశం. కొంచెం భయంగానూ ఉంది. కెమెరా వెనక ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదో భిన్నమైన అనుభవం. ఈ షోలో నేనేంటో అభిమానులు చూస్తారు’ అని అంటోందీ భామ.

రేడియోలో హోస్ట్‌గా పనిచేయడం చంద్రికాకు కొత్తేమి కాదు.. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తోపాటు అనేక రేడియో ప్రోగ్రామ్‌లు, టీవీషోలు, లైవ్‌షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

భారత సంతతికి చెందిన ఈమె కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయింది. నటన మీదున్న ఆసక్తితో ముందుగా మోడలింగ్‌.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.

‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుతులు’ హర్రర్‌ కామెడీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ చిత్రాన్నే తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’గా రీమేక్‌ చేయగా.. అందులో అతిథి పాత్రలో మెరిసింది. ‘సేయ్’, ‘ఉన్‌ కాదల్‌ ఇరుందల్‌’లో కీలక పాత్ర పోషించింది.

This browser does not support the video element.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే..’ అంటూ బాలకృష్ణతో స్టెప్పులేయడంతో టాలీవుడ్‌లో సెన్సెషనల్‌గా మారింది.

చంద్రికకు సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. అనాథలకు పుస్తకాలు, దుస్తులు, పంపిణీ చేస్తుంటుంది. ‘అలాంటి పిల్లల్ని చేరదీయడం... నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మనసుకి సంతృప్తిగానూ ఉంటుంది’ అంటోంది చంద్రిక.

వీలు చిక్కితే చాలు.. విహార యాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంది. ఎమోషన్‌ ఏదైనా దాన్ని స్విమ్మింగ్‌తో సెట్‌ చేస్తుందట. నచ్చిన ఆహారం తింటూ ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో కష్టపడుతుంది.

This browser does not support the video element.

గ్లామర్‌ ఫొటోలతో, డ్యాన్స్‌ వీడియోలతో ఇన్‌స్టాను ఒక ఊపు ఊపేస్తుంటుంది. ప్రస్తుతం సిల్క్‌స్మిత బయోపిక్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. ‘బాలీవుడ్‌ టు హాలీవుడ్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలోనూ నటిస్తోంది. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home