‘టచ్‌లో ఉండమంటూ..’
చంద్రికా రవి గురించి తెలుసా?
ప్రదీప్ మాచిరాజు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ‘టచ్‌లో ఉండు..’అనే స్పెషల్ సాంగ్ చేసింది చంద్రికా రవి.
నితిన్ భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
బాలకృష్ణ ‘వీరసింహరెడ్డి’లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి..’ స్పెషల్ సాంగ్‌తో చంద్రిక పాపులర్ అయ్యింది.
సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న
‘ది క్వీన్ ఆఫ్ సౌత్’లో చంద్రిక ప్రధాన పాత్ర పోషిస్తోంది.
భారతీయ మూలాలున్న చంద్రిక ఆస్ట్రేలియాలో జన్మించింది, పదహారేళ్లకే నటనను ప్రారంభించింది. కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసింది.
2012 లో ‘మిస్ మ్యాగ్జిమ్’ రన్నరప్‌గా, ‘మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా’ స్టేట్ ఫైనలిస్ట్‌గా నిలిచింది.
2019లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో తెలుగు తెరకు పరియమైంది ఈ భామ.
గాయపడిన వీధి కుక్కలకు రక్షణ కల్పిస్తుంది. తీరిక వేళల్లో వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది.
మహిళా అభ్యుదయ భావాలున్న చంద్రిక భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలతో కలసి పని చేస్తుంది. చిన్నారులు, మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ తెలుగు, తమిళ, హిందీ భాషలను చక్కగా రాయగలదు, మాట్లాడగలదు కూడా.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తుంది. దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పూజలు చేస్తుంటుంది చంద్రిక.