భోజనంలోనే ఆరోగ్యం.. అదెలాగో చూడండి..

చేసేది ఇంటి భోజనమే కదా.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదంటారా? అలా కాదండోయ్‌.. అందులో అన్ని రకాల పోషకాలు లేకపోతే ఎంత పరిమాణంలో తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. మీరు భోజనంలో ఏమేం తింటున్నారో ఓసారి చూడండి..

image: rkc

నూనెలు..

మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బ్రాండ్స్‌వే కాకుండా కల్తీవి కూడా ఉంటున్నాయి. అందుకే, కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైన నూనెను ఎంపిక చేసుకోవాలి. ఈ మధ్య విటమిన్లతో కూడిన నూనెలు కూడా వస్తున్నాయి. 

image: rkc

వేపుళ్లకు దూరంగా..

సాధారణంగా ఆహారంలో ఎక్కువ శాతం వేపుళ్లకే ప్రాధాన్యం ఇస్తాం. కూరగాయల్ని నూనెలో ఎక్కువ సేపు వేయిస్తే.. వాటిల్లో ఉండే పోషకాలు పోతాయి. అలాంటి ఆహారం తిన్నా ఏ ప్రయోజనం ఉండదు. దీనికి బదులుగా డ్రైరోస్ట్‌ చేస్తే ఆరోగ్యానికి మంచిది.

image: rkc

ఉప్పు తగ్గిస్తే..

ఉప్పు వేసిన చిప్స్‌, నట్స్‌ తెగ లాగించేస్తూ ఉంటాం. అవి గుండెకు ముప్పుని తెచ్చి పెడతాయి. నిల్వ పచ్చళ్లు, వడియాలు, అప్పడాల వంటి వాటిల్లోకూడా ఎక్కువగా ఉప్పు ఉంటుంది. వీటన్నిటినీ కాస్త తగ్గిస్తే బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.  

image: rkc

అన్నంతో జాగ్రత్త..

సాధారణంగానే అన్నం రెండు వంతులు, కూర ఒక వంతు తింటాం. నిజానికి, శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కూరలోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే.. అన్నం ఒక కప్పు, కూర రెండు కప్పులు తీసుకోవాలి. అది కూడా దంపుడు బియ్యంతో వండింది అయితే మధుమేహం నుంచి రక్షిస్తుంది. 

image: unslash

ప్రోటీన్ల కోసం..

మన రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఆహారంలో పప్పులు ఉండేలాగా చూసుకోవాలి. అంతే కాకుండా రోజూ ఒక గుడ్డు కూడా తినాలి. 

image: unslash

ఫైబర్‌..

ఫైబర్‌ అధికంగా ఉన్పప్పుడే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణవ్యవస్థలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కీరా, బీరకాయ, సొరకాయ వంటి పీచు పదార్థాలు తినాలి. దుంపలు కూడా అవసరమే కానీ తగిన మోతాదులో తీసుకోవాలి. 

image: unslash

తృణధాన్యాలతో..

రాత్రి భోజనానికి రాగులతో, జొన్నలతో చేసిన వంటకాలను తీసుకుంటే మంచిది. కావల్సిన పోషకాలు అందుతాయి. బరువు అదుపులో ఉంటుంది. రొట్టె, పుల్కా, రోటీ, జావ వంటివి తీసుకోవచ్చు.

image: unslash

పెరుగు..

పెరుగులో ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజులో కనీసం ఒక్కసారైనా పెరుగుని తీసుకోవాలి. కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

image: unslash

సలాడ్లతో..

భోజన పరిమాణం మరీ తక్కువగా ఉంటే సలాడ్లతో భర్తీ చేయొచ్చు. తాజా కూరగాయలు, పండ్లలో కొద్దిగా పెరుగు, మిరియాల పొడి కలుపుకొని ఆరగించొచ్చు. కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తొందరగా ఆకలి కూడా వేయదు.  

image: unslash

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

ఎందుకొచ్చిందీ తలనొప్పి?

Eenadu.net Home