సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొంటున్నారా?

మొబైల్‌ ఫోన్‌ పాడైతేనో.. అత్యవసరంగా ఫోన్‌ అవసరమైనప్పుడో చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొంటుంటారు.

ఒకవేళ సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనాలన్న ఆలోచన ఉందా? అయితే, ముందు IMEI నంబర్‌, ఆ మొబైల్‌ స్టేటస్‌ గురించి తెలుసుకోండి.

మీరు కొనబోయే మొబైల్‌ ఇంతకుముందు దొంగిలించిందా? ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగించారా?అనేది ఈ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

IMEI నంబర్‌ కోసం మొబైల్‌లో *#06# టైప్‌ చేసి డయల్ చేయాలి. లేదా ఫోన్ సెట్టింగ్స్‌లో About phone అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

 ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులుంటే రెండు వేర్వేరు IMEI నంబర్లు ఉంటాయి.

ఇప్పుడు ఆ ఫోన్‌ స్టేటస్‌ తెలుసుకోవడానికి KYM అని టైప్ చేసి 14422కి SMS పంపి మొబైల్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. KYM యాప్‌ ద్వారా ఆ వివరాలు పొందొచ్చు.

CEIR వెబ్‌పోర్టల్‌లో వెళ్లి ఫోన్‌ నంబర్‌, ఓటీపీ, IMEI నంబర్‌ ఎంటర్‌ చేసి కూడా సులువుగా స్టేటస్‌ తెలుసుకోవచ్చు.



అప్పుడు మీ మొబైల్‌ బ్రాండ్‌ పేరు, మోడల్‌ వంటి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ ఆ IMEI నంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంటే ఆ వివరాలూ తెలుస్తాయి.

ఫోన్‌ ధర గురించి మాత్రమే కాకుండా ఈ వివరాలన్నీ తెలుసుకున్నాకే సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనడానికి ముందడుగు వేయండి.

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home