పండిత్‌జీ జవహర్‌ లాల్‌ నెహ్రూ సూక్తులు!

‘బాలల దినోత్సవం’(నవంబర్‌ 14) సందర్భంగా.. భారత మొదటి ప్రధాని ‘ పండిత్‌ జీ జవహర్‌ లాల్‌ నెహ్రూ’ చెప్పిన సూక్తుల్లో కొన్ని..

image:RKC

‘ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్తపడని వ్యక్తి.. ఆ తరువాత గట్టి దెబ్బతింటాడు. అప్పుడు లేచి సంబాళించుకోవడం కూడా కష్టమవుతుంది.’

image:RKC

‘చదువుతోపాటు పెద్దల పట్ల వినయంగా ఉండడం కూడా నేర్చుకోవాలి.’

image:RKC

‘ఎంతసేపు చదివామన్నది కాదు.. ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం.’

image:RKC

‘పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు . రేపటి పౌరులు, జాతి భవిష్యత్తు నిర్మించేది వాళ్లే. కాబట్టి వారిని జాగ్రత్తగా, ప్రేమగా పెంచాలి.’

image:RKC

‘లక్ష్యాలు, ఆలోచనలు, విలువలు మర్చిపోయినప్పుడు మాత్రమే అపజయం పాలవుతారు.’

image:RKC

‘సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేశాం. ఎలా ఉన్నాం. ఏం సాధించామన్నది ముఖ్యం.’

image:RKC

‘లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది.’

image:RKC

‘చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకొంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు.’

image:RKC

‘పనిని అభిమానించడం మొదలు పెడితే విజయం దానంతటదే వస్తుంది.’

image:RKC

‘వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు పునాది కావాలి.’

image:RKC

 ‘ధైర్యంగా పని చేసే వారే విజయం సాధిస్తారు. ఫలితం ఎలా ఉంటుందోనని భయపడేవారిని ఎప్పటికీ విజయం వరించదు.’

image:RKC

సోషల్‌ మీడియాకి విరామం ఇవ్వండి.. ఎంత లాభామో!

ఈ అత్యవసర నంబర్లు తెలుసా!

కురుల ఆరోగ్యాన్ని.. కాపాడుకోండిలా!

Eenadu.net Home