చాక్లెట్ గర్ల్.. రాధిక!
సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లూ’లో రాధిక పాత్రతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించింది.. నటి నేహా శెట్టి. ప్రస్తుతం మరో ఇద్దరు యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.
image: instagram/iamnehashetty
రతినం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఇందులో కిరణ్‌కి జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది.
image: instagram/iamnehashetty
మరో యంగ్ హీరో కార్తీకేయ తాజా చిత్రం ‘బెదురులంక 2012’లోనూ నేహా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో పల్లెటూరు అమ్మాయిలా కనిపించనుంది. ‘చాక్లెట్ గర్ల్’ అనే మ్యూజిక్ వీడియోలో ఆడిపాడింది.
image: instagram/iamnehashetty
నేహా 1994లో కర్ణాటకలో పుట్టింది.. చదువు అక్కడే సాగింది. న్యూయార్క్ ఫిల్మ్ ఎకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. మోడలింగ్ అంటే నేహాకి బాగా ఇష్టమట.. దాని మీద ఆసక్తితోనే నటన వైపు అడుగుపెట్టింది.
image: instagram/iamnehashetty
మోడలింగ్ చేస్తున్న సమయంలోనే 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలిచింది. 2015లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. దీని తర్వాతే సినిమాల్లో అవకాశం వచ్చింది.
image: instagram/iamnehashetty
కన్నడలోనే 2016లో ‘ముంగారు మేల్ 2’తో తెరంగేట్రం చేసింది. 2018లో ‘మెహబూబా’ తెలుగులో ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయింది.
image: instagram/iamnehashetty
నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘గల్లీరౌడీ’లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత వచ్చిన ‘డీజే టిల్లూ’ తన కెరియర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
image: instagram/iamnehashetty
‘డీజే టిల్లూ’లో నేహా పోషించిన రాధిక పాత్రకు యూత్ ఫిదా అయింది. నెగటీవ్ షేడ్ ఉన్న పాత్రే అయినా.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈమె నటనకు అల్లు అర్జున్ కూడా ప్రశంసలు కురిపించాడు.
image: instagram/iamnehashetty
సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా.. తరచూ తన గ్లామర్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది.
image: instagram/iamnehashetty
ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ ఉంటుందట. అంతేకాదు తనకి డ్యాన్స్ చేయడం, పాటలు పాడటమన్నా కూడా బాగా ఇష్టమట.
image: instagram/iamnehashetty