చలి బాగా పెరిగితే ఎలా..?

సాధారణం కంటే ఉష్ణోగ్రత పడిపోతే వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికలు జారీ చేసి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తుంది.

image:RKC

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిలో 6 డిగ్రీలుంటే..చింతపల్లిలో 8 డిగ్రీలుంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో 11 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

image:RKC

ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల కంటే తక్కువగా నమోదయితే కోల్డ్‌వేవ్‌గా వాతావరణ కేంద్రం గుర్తిస్తుంది. కొన్నిసార్లు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత ఉన్నా కూడా కోల్డ్‌వేవ్‌గా పేర్కొంటారు.

image:RKC

తుపానుతో పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగు రకాల హెచ్చరికను విడుదల చేస్తారు. ఈ ప్రమాణాలనే ప్రపంచమంతా అమలు చేస్తారు.

image:RKC

ఉష్ణోగ్రత తగ్గినా ఇబ్బందులు లేకపోతే ఆకుపచ్చరంగు హెచ్చరిక ఇస్తారు. ఈ సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రజల దైనందిన కార్యక్రమాలకు అవాంతరాలు ఉండవు.

image:RKC

 పసుపు వర్ణం హెచ్చరిక ఇస్తే కొన్ని రోజుల పాటు ప్రతికూల పరిస్థితులుంటాయని అర్థం చేసుకోవాలి. ప్రజలు తమ పనులను అప్రమత్తంగా ఉండి పూర్తి చేసుకోవాలని సూచిస్తారు.

image:RKC

ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. రోడ్డు, రైలు, రవాణాకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు ఎదురవుతాయని గుర్తించాలి.

image:RKC

ఎరువు రంగు హెచ్చరిక విడుదల చేస్తే అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. రానున్న ప్రమాదాన్ని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తారు. ప్రజలకు సమాచారం ఇచ్చే బాధ్యతలను యంత్రాంగం చూసుకోవాల్సి ఉంటుంది.

image:RKC

ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటలలోపు వీరు బయట తిరగొద్దు.

image:RKC

ప్రజలు కూడా విటమిన్‌ సి ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. 

image:RKC

చలితో పాటు కాలుష్యం ఉన్నట్లయితే నడకకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వేడి ఆహారమే భుజించాలి. ఇంట్లో వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పిల్లలుంటే మరీ జాగ్రత్తగా ఉండాలి.

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home