నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి!
వాకింగ్‌కి వెళ్లినప్పుడు స్నేహితులు, తెలిసినవారు కలుస్తుంటారు. వారితో మాటల్లో పడి చాలామంది సమయాన్ని వృథా చేసుకుంటారు. కొద్దిసేపు మాట్లాడి వాకింగ్‌ని కొనసాగిస్తే మంచిది.
image:Pixabay
కొంతమంది ఒకే వేగంతో నడుస్తుంటారు. ఇలా కాకుండా.. మూడు నిమిషాలు వేగంగా, మరో మూడు నిమిషాలు నెమ్మదిగా నడవాలి.
image:Unsplash
చాలామంది పాదాలకు సరిపోని షూస్‌ని ధరించి ఇబ్బందులపాలవుతుంటారు. వేళ్ల నుంచి పాదం వరకు నప్పేలా ఉండి నడిచేందుకు సౌకర్యంగా ఉండే షూస్‌ని ధరించాలి. చెమటని పీల్చుకునే సాక్స్‌లను వాడాలి.
image:Unsplash
నిత్యం ఒకే రూట్‌లో వాకింగ్‌కి వెళ్లడం వల్ల బోర్ కొట్టడం సాధారణం. అందుకని, అప్పుడప్పుడు వాకింగ్ రూట్లను మారుస్తుండాలి.
image:Unsplash
మొబైల్‌లో పాటలు వింటూ వాకింగ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అయితే, ఎక్కువ సౌండ్ పెట్టుకుని నడవకూడదు. పక్కన జరిగే సంఘటనలను వినేలా అవకాశం కల్పించుకోవాలి.
image:Unsplash
వాకింగ్ అనగానే చాలామంది కాళ్లకు పని చెప్పేదని భావిస్తుంటారు. నడుస్తున్నప్పుడు మన చేతులు కూడా రిథమిక్‌గా మూవ్ అవుతుండాలి. image:Unsplash
కొంతమంది మొబైల్ చూస్తూ వాకింగ్ చేస్తుంటారు.
పరిసరాలను పట్టించుకోకుండా వాకింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలుంటాయి.
image:Unsplash
వాకింగ్ చేసేటప్పుడు ధరించే దుస్తులు మరీ బిగుతుగా, వదులుగా లేకుండా చూసుకోవాలి. కాటన్ దుస్తులను వాడటం శ్రేయస్కరం.
image:Unsplash
వాకింగ్ చేస్తున్నప్పుడు అనవసర విషయాలకు తావివ్వకుండా, ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి. ఉదయం వేళ పరిస్థితులు మీ దినచర్యపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
image:Unsplash