ఎలాన్ మస్క్‌కు ఎన్ని కంపెనీలున్నాయో తెలుసా?
ట్విటర్
ట్విటర్ కొనుగోలు విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఆ సంస్థను 44 బిలియన్ డాలర్లు పెట్టి ఇటీవల కొనుగోలు చేశారు మస్క్.
Image: Twitter
టెస్లా
టెస్లా మోటార్స్ సంస్థ 2003లో టెస్లా ఇంక్‌గా మారింది. ఈ కార్ల తయారీ కంపెనీకి మస్క్ సహా వ్యవస్థాపకుడు.. సీఈఓ. టెస్లా ఈవీ కార్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ సంస్థలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Image: Tesla
టెస్లా ఎనర్జీ
టెస్లా Incలో భాగమైన ఈ సంస్థ సోలార్ ప్యానెల్స్, రూఫ్స్, వాల్స్, పవర్‌ప్యాక్స్ తదితర సోలార్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసి విక్రయిస్తుంటుంది. దీన్ని 2015లో స్థాపించారు.
Image: Telsa Enargy/Wikipedia
స్పేస్ ఎక్స్
అంతరిక్ష పరిశోధనలపై తన ఆసక్తికి అనుగుణంగా మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను 2002లో స్థాపించారు. అంతరిక్షయానానికి ఉపయోగపడే స్పేస్‌క్రాఫ్ట్స్, రాకెట్ అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులో 10వేల మందికిపై ఉద్యోగులు ఉన్నారు.
Image: SpaceX
స్టార్‌లింక్
స్పేస్ ఎక్స్‌లో భాగమైన ఈ స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ప్రతి మారుమూల గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం ఉండాలనే లక్ష్యంతో మస్క్ దీన్ని 2019లో ప్రారంభించారు.
Image:StarLink
న్యూరాలింక్
మనిషి మెదడును కంప్యూటర్‌తో అనుసంధానం చేయడానికి పరిశోధనలు చేస్తోన్న సంస్థే న్యూరాలింక్. దీన్ని మ్యాక్స్ హోడక్, పాల్ మెరోల్లాతో కలిసి 2016లో దీన్ని స్థాపించారు. ఈ కంపెనీ చేస్తోన్న ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
Image:neuralink
ది బోరింగ్ కంపెనీ
అమెరికాకు చెందిన మౌలిక సదుపాయాలు, సొరంగ నిర్మాణాలు చేపట్టే ది బోరింగ్ కంపెనీ మస్క్‌దే. దీన్ని ఆయన 2016లో ప్రారంభించారు. గంటకు 700 మైళ్ల వేగంతో ప్రయాణించేలా ‘హైపర్‌లూప్’ ప్రాజెక్టుపై ఈ సంస్థ దృష్టి సారించింది.
Image: Twitter/The Boring Company
ఓపెన్ ఏఐ
ఇది కృత్రిమ మేధాపై పరిశోధనలు చేసే లేబొరేటరీ. మనుషులకు ఉపయుక్తంగా ఉండే కృత్రిమ మేధాను రూపొందించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్‌తోపాటు మరికొందరు కలిసి దీన్ని 2015లో స్థాపించారు.
Image: Twitter/OpenAI
బార్న్ట్ హెయిర్
ఈ మధ్యే ఎలన్ మస్క్ పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకీ దిగారు. బార్న్ట్ హెయిర్ పేరుతో ఓ కొత్త రకం పెర్‌ఫ్యూన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
Image: Twitter/Elon Musk
మస్క్ తన కెరీర్ ప్రారంభంలో జిప్2 అనే సంస్థను ప్రారంభించారు. ఇది న్యూస్ పేపర్లకు ఆన్‌లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను అందించేది.
Image:RKC
ఆ తర్వాత ఎక్స్.కామ్ అనే ఆన్‌లైన్ బ్యాంక్, పేపాల్ పేరుతో ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించారు మస్క్. ఆ తర్వాత అవి వివిధ కంపెనీల్లో విలీనమయ్యాయి.
Image:RKC
ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 189 బిలియన్ డాలర్లు.
Image:RKC