100 బిలియన్‌ డాలర్స్‌ @ ఎన్నేళ్లు?

గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల మార్కెట్‌ విలువ ఇప్పుడు కొన్ని వందల బిలియన్‌ డాలర్లు ఉంటుంది. కానీ, ఆయా సంస్థల విలువ తొలి 100 బిలియన్‌ డాలర్స్‌ చేరుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా?

Image: RKC

గూగుల్‌ @ 7 ఏళ్లు

సెర్చ్‌ ఇంజిన్‌గా 1998లో ప్రారంభమైన గూగుల్‌.. ఇప్పుడు ఓ దిగ్గజ టెక్‌ కంపెనీగా మారిపోయింది. 2004లో గూగుల్‌ 100 బిలియన్‌ మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ 1.21 ట్రిలియన్‌ డాలర్స్‌. 

Image: RKC

ఫేస్‌బుక్‌ @ 8 ఏళ్లు

ఫేస్‌బుక్‌ 2004లో ప్రారంభమైంది. 2012లో ఐపీఓకి వచ్చిన తర్వాత ఎఫ్‌బీ మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్స్‌కు చేరుకుంది. ప్రస్తుత విలువ 448 బిలియన్‌ డాలర్లు

Image: RKC

అమెజాన్‌ @ 16 ఏళ్లు 

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థను జెఫ్‌ బెజోస్‌ 1994లో స్థాపించారు. 1997లో ఐపీఓకి వచ్చింది. 2010లో తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువకు చేరుకుంది. ప్రస్తుత విలువ 996 బిలియన్‌ డాలర్లు.

Image: RKC

మైక్రోసాఫ్ట్‌ @ 20 ఏళ్లు 

మైక్రోసాఫ్ట్‌ను 1975లో ప్రారంభించగా.. 1986లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఎట్టకేలకు 100 బిలియన్‌ డాలర్ల విలువను 1996లో అందుకుంది. ప్రస్తుత విలువ 1.92ట్రిలియన్‌ డాలర్లు. 

Image: RKC

నెట్‌ఫ్లిక్స్‌ @ 21 ఏళ్లు

డీవీడీ రెంటల్‌ సర్వీస్‌గా 1997లో ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే పాపులర్‌ ఓటీటీగా ఎదిగింది. 2002లో ఇది ఐపీఓకి వచ్చింది. 2018లో 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ప్రస్తుత విలువ 154 బిలియన్‌ డాలర్లు. 

Image: RKC

యాపిల్‌ @ 30 ఏళ్లు

యాపిల్‌ సంస్థ రూపొందించిన గ్యాడ్జెట్స్‌ ఖరీదు ఎక్కువే అయినా.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. 1976లో మొదలైన యాపిల్‌.. 1980లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. 2006లో 100 బిలియన్‌ డాలర్ల విలువను అందుకుంది. ప్రస్తుత విలువ 2.41 ట్రిలియన్‌ డాలర్లు.

Image: RKC

డిస్నీ @ 74 ఏళ్లు

డిస్నీ సంస్థ ఓ యానిమేషన్‌ స్టూడియోగా ప్రారంభమై అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 1957లో ఐపీఓకి వచ్చిన డిస్నీ.. తొలి 100 బిలియన్‌ డాలర్ల మార్కును 1997లో చేరుకుంది. ప్రస్తుత విలువ 192 బిలియన్‌ డాలర్లు.

Image: RKC

రిలయన్స్‌ @ 49 ఏళ్లు

రిలయన్స్‌ సంస్థ 1958లో ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ 2007లో తొలిసారి 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను చేరుకుంది. ప్రస్తుత విలువ 199 బిలియన్‌ డాలర్లు.

Image: RKC

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ ధరించిన చీరల విశేషాలు

క్రెడిట్‌ స్కోరు పెంచే 8 టిప్స్‌

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను చూడాలంటే ఇలా చేయండి..

Eenadu.net Home