ఐకూ 9టీ.. 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌!

ఐకూ నుంచి ఫ్లాగ్‌షిప్‌ 5జీ మొబైల్‌ ‘ఐకూ 9టీ’ ఆగస్టు 2న మార్కెట్లో విడుదలవుతోంది.

Image: Iqoo

బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ భాగస్వామ్యంతో ఐకూ సంస్థ ఈ మొబైల్‌ను రూపొందించింది.

Image: Iqoo

ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల ఈ5 అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది.

Image: Iqoo

స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్‌, ఫొటోగ్రఫీ కోసం అదనంగా వీ1ప్లస్‌ చిప్‌ను అమర్చారు.

Image: Iqoo

4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న ఈ మొబైల్‌.. 120 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 20 నిమిషాల్లో వందశాతం ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Image: Iqoo

గేమ్స్‌ ఆడేటప్పుడు ఫోన్‌ వేడెక్కకుండా ఇందులో వేపర్‌ ఛాంబర్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు.

Image: Iqoo

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 + 12 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Iqoo

8 జీబీ.. 12 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో ఈ మొబైల్‌ లభిస్తుంది. 4 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు.

Image: Iqoo

8జీబీ / 128 జీబీ వేరియంట్‌ ధర రూ.45,999 కాగా.. 12 జీబీ / 256 జీబీ వేరియంట్‌ ధర రూ. 50,999.

Image: Iqoo

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్‌ కింద రూ. 4వేల వరకు, మొబైల్‌ ఎక్స్ఛేంజ్‌ స్కీమ్‌లో ఐకూ మొబైల్స్‌కు రూ. 7వేలు, ఇతర మొబైల్స్‌కు రూ. 5వేల వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.

Image: Iqoo

ఈ బుల్లి డివైజ్‌తో మీ పనులు మరింత స్మార్ట్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

రియల్‌మీలో 12, 12+.. ఫీచర్లు ఇవిగో!

Eenadu.net Home