పనిలో ఏకాగ్రత లోపిస్తోందా? ఇలా చేయండి!
సరైన నిద్ర..
శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. అందుకే 6 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
image:RKC
వ్యాయామం తప్పనిసరి..!
వ్యాయామం చేయడం ద్వారా శరీరం ఉత్తేజితమై రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీంతో పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేయెచ్చు.
image:RKC
భోజనం!
సమయానికి భోజనం చేయకున్నా చిరాకు, కోపం, అసహనం వెంటాడుతాయట! దీంతో పని మీద ధ్యాస పెట్టలేరు. అందుకే వేళకు భోజనం చేసేయాలి.
image:RKC
ధ్యానం..
ధ్యానం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.
image:RKC
వీటికి దూరంగా..
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. దీనివల్ల పని మీద దృష్టి సారించలేరు.
image:RKC
పౌష్టికాహారం..
ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా ఏకాగ్రతతో చేయగలుగుతారు. అందుకే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
image:RKC
బాధ్యతగా..
పనిని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోండి. దీనివల్ల ఆ పని మీద మీకు ఏకాగ్రత పెరుగుతుంది.
image:RKC
వాయిదాలు వద్దు..
పనిని వాయిదా వేయకండి. నిర్ణీతకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. దీనివల్ల మీ పూర్తి ధ్యాస ఆ పని మీదే ఉంటుంది.
image:RKC
చికిత్స తప్పనిసరి..
మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలి. వారు.. మీ మానసిక స్థితి తెలుసుకొని తగిన చికిత్స అందిస్తారు.
image:RKC