ఏం పిల్లది.. ఎంత మాటన్నది!

‘ఝుమ్మంది నాదం’తో వెండితెరకు పరిచయమైంది నటి తాప్సీ. అలా తొలి సినిమాతోనే కుర్రాళ్లను ఆకట్టుకుంది. 

(Photos: Instagram/Tapsee)

ఇక్కడ వరుస సినిమాలు చేస్తుండగానే... బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌ లేడీ హీరోగా ఎదుగుతోంది. 

అప్పుడప్పుడు టాలీవుడ్‌పై, బాలీవుడ్‌లో తోటి నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఆమె చేసిన వ్యాఖ్యలేంటో చూద్దామా..

నేను నటించిన తెలుగు సినిమాలు ఫ్లాప్‌ కావడంతో.. నేను దురదృష్టవంతురాలినని నిందించారు. సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో మాత్రమే హీరోయిన్ ఉంటుంది. అలాంటప్పుడు నాయికల్ని నిందించడం తప్పు.

దక్షిణాది చిత్రాల్లో నటించినప్పుడు నాకు గుర్తింపు రాలేదు. అవకాశాలు వచ్చినా.. సంతృప్తి ఉండేది కాదు. అందుకే బాలీవుడ్‌కి వచ్చాను. ‘పింక్‌’ నా కెరియర్‌ను మలుపు తిప్పింది. 

మొదట నాకు సినిమా ఎంపిక గురించి అవగాహన లేదు. ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. టాలీవుడ్‌తో పోలిస్తే.. బాలీవుడ్‌ నాకు మంచి అవకాశాలు ఇచ్చింది. 

ఎంతో కష్టపడి ఎదిగినవారి కంటే.. తారల వారసులు సినిమాల్లోకి రావడం సులభం. మీడియా దృష్టంతా వారిపైనే ఉంటుంది. దీంతో ఏం సాధించకుండానే పాపులారిటీ వచ్చేస్తోంది. 

మహిళా ప్రాధాన్య చిత్రాల్లో హీరోలు నటించడానికి ఒప్పుకోరు. నా సినిమాలో నటించడానికి నిర్మాత ఓ హీరోని సంప్రదిస్తే నిరాకరించాడు. 

హీరోయిన్‌గా ఎంత స్టార్‌డమ్‌ వచ్చినా.. హీరోలకంటే తక్కువగానే మమ్మల్ని చూస్తారు. హీరోలతో పోల్చితే మాకు ఇస్తున్న పారితోషకాల్లో భారీ వ్యత్యాసముంది. 

ఓసారి పెళ్లిపై స్పందించిన తాప్సీ.. ‘నేనింకా ప్రెగ్నెంట్‌ కాలేదు. కాబట్టి.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’అని అంది. అప్పట్లో టాలీవుడ్‌లోని ఓ దిగ్గజ దర్శకుడిపై కూడా తాప్సీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home