క్రెడిట్‌ కార్డుతో ఈ తప్పులు చేయొద్దు!

ప్రతి దానికీ క్రెడిట్‌ కార్డు వాడకం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. బ్యాంక్‌లూ సులువుగా జారీ చేస్తుండడంతో వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది.

ఆఫర్లు, రివార్డు వస్తుండడంతో క్రెడిట్‌కార్డులు వాడేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మీరూ క్రెడిట్‌ కార్డును వాడుతుంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు.

నగదు విత్‌డ్రా

అత్యవసర సమయంలో నగదు కావాలంటే క్రెడిట్ కార్డ్‌ ద్వారా విత్‌డ్రా చేసుకొనే సదుపాయం ఉంది. కానీ అధిక వడ్డీ ఎదుర్కోవాల్సి ఉంటుందనేది గుర్తుంచుకోండి.

రోజువారీ ఖర్చులకొద్దు

రోజువారీ చేసే కొనుగోళ్లకూ క్రెడిట్‌ కార్డ్‌ను వాడేస్తుంటే ఖర్చులపై నియంత్రణ ఉండదు. కాబట్టి ఈ తరహా కొనుగోళ్లకు నగదు లేదా డెబిట్‌ కార్డును వాడడం అలవాటు చేసుకోండి.

పాత కార్డు తీసేయొద్దు

పాత క్రెడిట్‌ కార్డులను తీసేస్తే క్రెడిట్ హిస్టరీ తగ్గుతుంది. దీంతో క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. అందుకే పాత కార్డుల్ని రద్దు చేయొద్దనేది నిపుణుల సలహా.

రుణానికి ముందు

రుణం కోసం వెళ్లినప్పుడు బ్యాంకులు ప్రస్తుత అప్పును పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి కొత్త రుణం తీసుకొనే ముందు అధిక విలువ గల వస్తువులను కొనుగోలు చేయకపోవడం ఉత్తమం.

ఆసుపత్రి ఖర్చులు

క్రెడిట్‌ కార్డు సాయంతో ఆసుపత్రి ఖర్చులు చెల్లించొచ్చు. ఈ బిల్లులను కూడా మనమే తిరిగి చెల్లించాలనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది.

అలర్ట్‌గా ఉన్నారా?

క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ముఖ్యం. కాబట్టి చెల్లింపుల తేదీని రిమైండర్‌గా పెట్టుకోవాలి. లావాదేవీలకూ అలర్ట్‌లు పెట్టుకోవడం ద్వారా మోసాలకు చెక్‌ పెట్టొచ్చు.

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌

క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించలేనప్పుడు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఉపయోగకరమే. మీ దగ్గర తగిన ప్రణాళిక లేనప్పుడు ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కాబట్టి వాడే ముందే జాగ్రత్త.

దృశ్యం.. ఆరు రీమేక్‌లు.. అరుదైన రికార్డులు..

ఖుషి కపూర్‌ ‘స్కూల్‌డేస్‌’ మెమొరీస్‌.. సింపుల్‌గా నేహా

₹250 నుంచే సిప్‌.. వివరాలు ఇవీ..!

Eenadu.net Home