టెస్టుల్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్నది వీళ్లే..!

1. రాహుల్‌ ద్రవిడ్‌


భారత మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్ కెరీర్‌లో 164 టెస్టులు ఆడి 31, 258 బంతులును ఎదుర్కొని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Source: Social Media

2. సచిన్‌ తెందూల్కర్‌


క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడి 29,437 బంతులను ఎదుర్కొని రెండో స్థానంలో నిలిచాడు.

Source: Social Media

3. జాక్వెస్‌ కలిస్  


సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ మొత్తం 166 టెస్టులు ఆడి 28,903 బంతులు ఎదుర్కొన్నాడు.

Source: Social Media

4. శివనారాయణ్ చందర్‌ పాల్ 


వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ్ చందర్‌ పాల్ తన కెరీర్‌లో 164 టెస్టులు ఆడి 27,395 బంతులు ఎదుర్కొని నాలుగో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

5. అలన్‌ బోర్డర్‌


ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం అలన్‌ బోర్డర్‌ మొత్తం 156 టెస్టులు ఆడి 27,002 బంతులు ఎదుర్కొని ఐదో స్థానంలో నిలిచాడు.

Source: Social Media

6. అలిస్టర్‌ కుక్ 


ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ 161 టెస్టుల్లో 26,562 బంతులను ఎదుర్కొని ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

7. మహేల జయవర్ధనే


శ్రీలంక మాజీ ప్లేయర్‌ మహేల జయవర్ధనే తన కెరీర్‌లో 149 టెస్టులు ఆడి 22,959 బంతులను ఎదుర్కొన్నాడు.

Source: Social Media

8. కుమార సంగక్కర


శ్రీలంక మాజీ వికెట్‌కీపర్‌ కుమార సంగక్కర 134 టెస్టులు ఆడి 22,882 బంతులను ఎదుర్కొని 8వ స్థానంలో నిలిచాడు.

Source: Social Media

9. రికీ పాంటింగ్‌


ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తన కెరీర్‌లో 168 టెస్టులు ఆడి 22,782 బంతులను ఎదుర్కొని తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

10. స్టీవ్‌ వా


ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్‌ వా తన కెరీర్‌లో 168 టెస్టులు ఆడి 22,461 బంతులను ఎదుర్కొని ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.

Source: Social Media

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home