ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌ ప్రేమ వివాహం. నెట్టింట వైరల్ వార్త ఇదే.

డేనియల్‌ వ్యాట్‌ ప్రేమించి పెళ్లాడింది అబ్బాయిని కాదు ఓ అమ్మాయిని మరి. అందుకే అంత వైరల్‌.

ఐదేళ్లుగా జార్జి హాడ్జ్‌ అనే మహిళతో ప్రేమలో ఉంది వ్యాట్‌. 2023లో నిశ్చితార్ధం చేసుకొని, ఇప్పుడు (జూన్‌ 10న) లండన్‌లో వివాహం చేసుకున్నారు.  

తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ చెరో పూల బొకేని పట్టుకొని నడిచి వస్తున్న ఫొటో ఇప్పుడు వైరల్‌ పిక్‌. ‘మైన్‌ ఫరెవర్‌’ అనే క్యాప్షనూ ఆ ఫొటోతో రాసుకొచ్చింది వ్యాట్‌. 

వ్యాట్ ప్రేయసి జార్జి హాడ్జ్‌ సీఏఏ బేస్‌కు చెందిన మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు హెడ్‌. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్‌ ఏజెంట్‌ కూడా.

వ్యాట్ ముందుగా తనని ప్రేమను వ్యక్తం చేసిందట. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవడంతో హాడ్జ్‌ ఓకే చెప్పేసింది.

వ్యాట్‌ ఆడే మ్యాచ్‌లకు హాడ్జ్‌ హాజరయ్యి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మ్యాచ్‌ సమయంలో స్టేడియంలో సందడి చేస్తుంది.

వీరిద్దరూ ఫ్యామిలీ ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటారు. ఫొటో షూట్లతో ఆకట్టుకుంటూ ఉంటారు. తరచూ విహారయాత్రలకు వెళుతుంటారు. ప్రకృతిలో గడపడమంటే ఇష్టం.

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home