ఇంగ్లాండ్‌తో సై
వన్డే ప్రపంచకప్‌లో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు భారత్ ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న తలపడేందుకు సిద్ధమవుతోంది. జిమ్ సందర్భంగా కేఎల్ రాహుల్, బుమ్రా, శ్రేయస్.. ఇలా ఫోజిచ్చారు.
డ్యాన్స్ అదుర్స్
వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను ఓడించిన అనంతరం రషీద్ ఖాన్‌తో కలిసి ఇర్ఫాన్ పఠాన్ కూడా డ్యాన్స్ వేశాడు. ఆ ఇమేజ్‌ను ఓ అఫ్గాన్ అభిమాని పెయింటింగ్ వేయగా.. దానిని ఇర్ఫాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.
జలకాలాడుతూ..
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు సమయం ఉండటంతో కేఎల్ రాహుల్, భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ ఇలా ప్రకృతి ఒడిలో జలకాలాడారు.
బ్యాట్ బహుమతి
వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై అఫ్గాన్ సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్‌కు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాట్‌ను బహూకరించాడు.
సీఎంతో కింగ్
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్‌ను భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మర్యాదపూర్వకంగా కలిశాడు. ధర్మశాల వేదికగా కివీస్‌తో మ్యాచ్ అనంతరం ఈ భేటీ జరిగింది.
అభిమానుల ఆనందం
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్లు క్వింటన్ డికాక్ (174) భారీ శతకం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (90) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ పెవిలియన్‌కు వచ్చేటప్పుడు అభిమానులు అభినందనలు తెలిపారు.
దలైలామాతో కివీస్
బౌద్ధమత గురువు దలైలామాను న్యూజిలాండ్ క్రికెటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తోపాటు మిగతా సభ్యులు ఆశీస్సులు తీసుకున్నారు.
సినీ హీరోతో క్రికెట్ హీరో
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కలిసి సందడి చేశారు. ఆ ఫొటోను క్రికెట్ విశ్లేషకుడు జోన్స్ తన ట్విటర్ షేర్ చేశాడు.
జైలర్‌తో పఠాన్
సూపర్ స్టార్ రజినీకాంత్‌ను భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కలిశాడు. సాధారణంగా ఉండే తలైవాను కలవడం ఆనందంగా ఉందని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నట్లు పఠాన్ తెలిపాడు.
ఇది సెల్ఫీ టైమ్
భారత యువ ఆటగాడు రిషభ్ పంత్ పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న పంత్.. జిమ్‌లో విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకున్న ఫొటో ఇది.