తారల్ని పెళ్లాడిన క్రికెటర్లు!

రాహుల్‌ - అతియా

తాజాగా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి జనవరి 24న పెళ్లి చేసుకున్నారు.

Image: Instagram

విరాట్‌ - అనుష్క

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌ 2017లో ఇటలీలో వీరి పెళ్లి జరిగింది.

Image: Instagram

హార్దిక్‌ - నటాషా

భారత్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్‌ను 2020లో వివాహం చేసుకున్నాడు. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నటాషా.. ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది.

Image: Instagram

జహీర్‌ - సాగరిక

భారత మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌.. నటి సాగరిక ఘట్కే 2017లో వివాహం చేసుకున్నారు. షారుక్‌ఖాన్‌ ‘చెక్‌ దే ఇండియా’తో సాగరిక ఘట్కే పాపులరైంది.

Image: Instagram

హర్భజన్‌ - గీత

దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకొని వివాహబంధంతో ఒక్కటయ్యారు క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, నటి గీతా బస్రా. 2015లో వీరి వివాహమైంది. ‘దిల్‌ దియా హై’, ‘ది ట్రైన్‌’ తదితర చిత్రాల్లో గీత నటించింది.

Image: Instagram

యువరాజ్‌ - హజెల్‌

బాలీవుడ్‌ బ్యూటీ హజెల్‌ కీచ్‌ను క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ 2015లో పెళ్లి చేసుకున్నాడు. తమిళ్‌ ‘బిల్లా’, హిందీ ‘బాడీగార్డ్‌’లో నటించిన హజెల్‌.. పలు సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. పలు టీవీ షోల్లోనూ పాల్గొంది.

Image: Instagram

అజహరుద్దీన్‌ - సంగీత

భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌, ఒకప్పటి బాలీవుడ్‌ తార సంగీతా బిజ్లానీ 1996లో వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2010లో విడిపోయారు. 

Image: Facebook/IFFa

మన్సూర్‌ అలీ - షర్మిలా ఠాగూర్‌

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌, ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ షర్మిలా ఠాగూర్‌ వివాహం 1968లో జరిగింది. నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ వీరి కుమారుడే.

Image: Twitter/Movies N Memories

చాహల్‌ - ధనశ్రీ

టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ 2020లో పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ హీరోయిన్‌ కాదు గానీ, మంచి కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌, సోషల్‌మీడియా సెలబ్రిటీ.

Image: Instagram

టీ20 ఫార్మాట్‌లోనూ శతక్కొట్టారు!

అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదేశారు!

టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లు!

Eenadu.net Home