కళ్లతోనే కట్టి పడేసే..సోనాక్షి
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. వెబ్‌సిరీస్‌లో అడుగుపెట్టింది. తొలిసారిగా తను నటించిన వెబ్‌సిరీస్ ‘దాహడ్’ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
Image: Instagram/Sonakshi sinha
క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో సోనాక్షి.. అంజలి భాటి అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది.
Image: Instagram/Sonakshi sinha
బాలీవుడ్ నటుడు శత్రఘ్న సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సోనాక్షి.. సల్మాన్ ఖాన్‌తో ‘దబాంగ్’తో తెరంగేట్రం చేసింది.
Image: Instagram/Sonakshi sinha
ఈ తర్వాత ‘రౌడీ రాథోడ్’, ‘జోకర్’, ‘దబాంగ్ 2’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సోనాక్షి.
Image: Instagram/Sonakshi sinha
ఓ వైపు హీరోలకు జోడీగా.. గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది.
Image: Instagram/Sonakshi sinha
గతేడాది.. హ్యుమా ఖురేషితో కలిసి ‘డబుల్ ఎక్స్‌ఎల్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో లావుగా కనిపించడం కోసం సోనాక్షి.. దాదాపు 15 కిలోల బరువు పెరిగింది.
Image: Instagram/Sonakshi sinha
ఈ బీటౌన్ బ్యూటీ.. బాలీవుడ్‌ను దాటి కోలీవుడ్‌లో ‘లింగా’ అనే సినిమాలో నటించింది. రజనీకాంత్ హీరోగా కే.ఎస్. రవి కుమార్ తెరకెక్కించిన చిత్రమది.
Image: Instagram/Sonakshi sinha
సోనాక్షి నటిగానే కాదు.. గాయనిగానూ మెప్పిస్తోంది. ‘తేవర్’, ‘అఖీరా’, ‘నూర్’ తదితర చిత్రాలు, పలు వీడియో ఆల్బమ్స్‌లో పాటలు పాడింది.
Image: Instagram/Sonakshi sinha
ప్రస్తుతం సోనాక్షి.. ‘కకుడ’, ‘కిఖితా రాయ్ అండ్ బుక్ ఆఫ్ డార్క్‌నెస్’, ‘బడే మియా చోటే మియా’ చిత్రాల్లో నటిస్తోంది.
Image: Instagram/Sonakshi sinha
సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న వెబ్‌సిరీస్ ‘హీరామండీ’లోనూ సోనాక్షి నటిస్తోంది. ఇందులో ఈమెతోపాటు మనీషా కొయిరాలా, అదితీరావ్ హైదరీ, రిచా చద్దా తదితరులు నటిస్తున్నారు.
Image: Instagram/Sonakshi sinha
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సోనాక్షికి.. ఇన్‌స్టాలో 25.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Sonakshi sinha