వినేశ్ ఫొగాట్ హ్యాట్రిక్: పట్టు పట్టింది.. పతకం కొట్టింది
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు దుమ్మురేపారు. మహిళల 53 కేజీల నోర్డిక్ విభాగంలో వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం గెలుచుకుంది. Image:Instagram/Vinesh Phogat
నోర్డిక్ విధానంలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినవాళ్లే విజేత. మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను మొదట చిత్తు చేసిన వినేశ్.. చివరి మ్యాచ్‌లో కేశాని (శ్రీలంక)ని మట్టికరిపించి పసిడి పట్టేసింది.
Image:Eenadu
ఈ విజయంతో వినేశ్ ఫొగాట్ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా (2014, 2018, 2022) మూడు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్రలోకెక్కింది.
Image:Instagram/Vinesh Phogat
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటిన వినేశ్.. కామన్వెల్త్, ఆసియా గేమ్స్.. రెండింటిలోనూ బంగారు పతకం సాధించిన తొలి భారత రెజ్లర్‌గానూ నిలిచింది.
Image:Instagram/Vinesh Phogat
కామన్వెల్త్‌లో సత్తా చాటుతున్న వినేశ్‌కు ఒలింపిక్స్ మాత్రం కలిసి రావట్లేదు. రియో ఒలింపిక్స్(2016)లో ప్రత్యర్థితో పోటీ పడుతుండగా వినేశ్ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఆ పోటీల నుంచి నిష్క్రమించింది.
Image:Instagram/Vinesh Phogat
ఆ గాయం నుంచి కోలుకున్న వినేశ్.. టోక్యో ఒలింపిక్స్‌లో (53 కేజీల విభాగంలో) ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది.
Image:Instagram/Vinesh Phogat
వ్యక్తిగత విషయాలకొస్తే.. 1994 ఆగస్టు 25న హరియాణాలోని బివానీ జిల్లాలో వినేశ్ జన్మించింది. ఈమెది రెజర్ల కుటుంబం. ప్రముఖ రెజర్లు గీత ఫొగాట్, బబితా ఫొగాట్, రీతూ ఫొగాట్‌లు వినేశ్ కుటుంబసభ్యులే. Image:Instagram/Vinesh Phogat
వినేశ్.. తన మిత్రుడు, జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు బంగారు పతక విజేత అయిన సోమ్‌వీర్ రాతీని 2018లో వివాహం చేసుకుంది.
Image:Instagram/Vinesh Phogat
వీరిది ప్రేమ వివాహం. 2011 నుంచే ఒకరికొకరు పరిచయం. ఇండియన్ రైల్వేస్‌లో పని చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
Image:Instagram/Vinesh Phogat
2016లో అర్జున అవార్డు, 2020లో క్రీడారంగంలో దేశ అత్యున్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డును అందుకుంది.
Image:Instagram/Vinesh Phogat