కిస్సిక్‌తో రంగంలోకి డ్యాన్సింగ్‌ క్వీన్‌

అందం, అభినయం, డ్యాన్స్‌ స్కిల్స్‌తో కెరీర్‌లో దూసుకుపోతోంది శ్రీలీల. ప్రస్తుతం ‘పుష్ప 2’లో స్పెషల్ పాటతో రంగంలో దిగనుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది.

స్ప్రింగ్‌లా బాడీనీ మెలికలు తిప్పుతూ తన డ్యాన్స్‌తో కుర్రకారును స్టెప్పులేయించే శ్రీలీల ‘కిస్సిక్‌’ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. 

రవితేజ ‘మాస్‌ జాతర’, నితిన్‌ ‘రాబిన్‌ హుడ్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోనూ నటిస్తోంది.

గతేడాది ‘ధమాకా’కి సైమా నుంచి ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.

2017లో ‘చిత్రంగద’తో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల... 2021లో వచ్చిన ‘పెళ్లి సందడి’తోనే నాయికగా మారింది. 

ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరించిన శ్రీలీల వాటి ఫలితం విషయంలో ఇబ్బంది పడింది. 

ఈమెకి డ్యాన్స్‌ అంటే ఇష్టం. చిన్నప్పుడే సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంది. స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది.. ఇస్తోంది కూడా..

సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు ఒక్కోసారి బీచ్‌లో గంటల తరబడి ఎదురు చూస్తానని చెప్పింది.

ఖాళీ సమయం దొరికితే తన పాటలకే డ్యాన్స్‌ చేస్తూ.. ఆరీల్స్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది. శ్రీలీల ఇన్‌స్టా ఖాతాకి 63లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఆరెంజ్‌ కలర్‌ అంటే ఇష్టం. తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఆ రంగు దుస్తులతో ఉన్న ఫొటోలే ఎక్కువగా ఉంటాయి.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home