ఈ దేశాల్లో విహారం.. చాలా ప్రమాదం!

విహారయాత్రలు ఇష్టపడేవారు తరచూ వివిధ దేశాలకు వెళ్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో పర్యటించడం అంత శ్రేయస్కరం కాదని, ప్రమాదాలు పొంచి ఉంటాయని యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యాటకుల్ని హెచ్చరిస్తోంది. మరి వాటిలో టాప్‌ 10 ప్రమాదకర దేశాలేవో చూద్దాం..

(Photos: Pixels/Pixabay)

1. వెనుజువెలా

ఈ దేశంలో ఎక్కువగా ఆందోళనలు, హింసాకాండలు జరుగుతుంటాయి. వీటిని అదునుగా చేసుకొని దుండగులు దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు చేస్తుంటారట. 

2. ఇరాక్‌

ఇక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య తరచూ కాల్పులు జరుగుతాయి. కిడ్నాప్‌లూ చోటు చేసుకుంటాయి. 

3. సొమాలియా

ఈ దేశం తరచూ ఉగ్రవాద దాడులు, నేరాలు, ప్రజల ఆందోళనలతో అట్టుడికిపోతుంటుంది. హత్యలు, అపహరణలు సర్వసాధారణం.

4. హైతి

ఇక్కడ పేదరికం ఎక్కువ. దీంతో నేరాలు, కిడ్నాప్‌, ఆందోళనలు తరచూ చోటుచేసుకుంటాయి. పర్యాటకులపై దాడులు కూడా జరుగుతుంటాయి. 

5. ఉక్రెయిన్‌

రష్యాతో జరుగుతోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సైనిక, వైమానిక దాడులతో ఈ దేశం దద్దరిల్లిపోతోంది. 

6. ఆఫ్ఘానిస్థాన్‌

తాలిబన్ల చేతిలో చిక్కుకున్న ఆఫ్ఘాన్‌లో నేరాలు సర్వసాధారణం. ఎదురించే ప్రజల్ని కాల్చి చంపేస్తుంటారు. ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. 

7. యెమెన్‌

ఈ దేశం ఉగ్రవాదంతోపాటు ఆందోళనలు, సాయుధ పోరాటాలు, లాండ్‌మైన్స్‌, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. అక్కడ జరుగుతోన్న అంతర్యుద్ధంతో అనేక భవనాలు, పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి. 

8. సిరియా

ఇక్కడ నిత్యం ఉగ్రవాద దాడులు, పోరాటాలు, ఆందోళనలు చోటుచేసుకుంటాయి. వీటిని అదుపులో పెట్టేందుకు అక్కడి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు, పర్యాటకులూ ఇబ్బందులపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

9. సూడాన్‌

ఒకవైపు దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలు.. మరోవైపు దొంగతనాలు, కిడ్నాపులు, దోపిడీలు సూడాన్‌ను హింసాత్మక దేశంగా మార్చేశాయి.  

10. సౌత్‌ సూడాన్‌

స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటాయి. అక్కడ సాధారణ ప్రజల వద్ద కూడా ఆయుధాలు ఉంటాయి. మరోవైపు రహదారులపై కార్లను హైజాక్‌ చేయడం, ప్రయాణికుల్ని హింసించడం, దోపిడీలు అక్కడ సాధారణ విషయం.

ప్రేమతత్వం గురించి చెబుతున్న సద్గురు

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

Eenadu.net Home