ఇక్కడ హైకింగ్, ట్రెక్కింగ్‌ చాలా డేంజర్‌ గురూ!

అడ్వెంచర్స్‌ను ఇష్టపడే చాలా మంది వీలు కుదిరినప్పుడల్లా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హైకింగ్‌, ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. వాటిలో ఈ కొన్ని మార్గాలు ఎంతో సాహసోపేతంగా, ప్రమాదకరంగా ఉంటాయి. అవేంటో చూసేయండి.

Image : Eenadu

చాదర్‌ లేక్‌ ట్రాక్‌

దీనిని జన్స్కర్‌ గార్జ్‌ ట్రెక్‌ అని కూడా పిలుస్తారు. లద్ధాఖ్‌లోని జన్స్కర్‌ నది వద్ద ఇది ఉంటుంది. గడ్డకట్టే నదిపై నడవడం మంచి అనుభూతి కలిగిస్తుంది. చలికాలంలో విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎక్కువగా వస్తుంటారు. 

Image : Rkc

హెమిస్‌ నేషనల్‌ పార్క్‌

లద్ధాఖ్‌ రీజియన్‌లో ఈ పార్క్‌ ఉంటుంది. జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ స్నో లెపర్డ్‌ సహా అనేక అరుదైన వన్య ప్రాణులు కన్పిస్తాయి. 

Image : Social media

రూపిన్‌ పాస్‌

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ధౌలా నుంచి హైకింగ్‌ ప్రారంభమై.. హిమాచల్‌లోని సంగ్లా వద్ద ముగుస్తుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఈ మార్గంలో కనువిందు చేస్తుంటాయి.

Image : Social media

నందాదేవి బేస్‌ క్యాంప్‌

దేశంలోని రెండో ఎత్తయిన పర్వతం. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంటుంది. కాలిబాట ప్రయాణంలో మనోహర దృశ్యాలు తారసపడతాయి. అరుదైన వృక్ష, జంతుజాలం కూడా కనిపిస్తుంది. 

Image : Rkc

కిన్నెర్‌ కైలాష్‌ సర్క్యూట్‌ హైక్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 79 అడుగుల ఎత్తయిన ఏకశిల శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. 

Image : Social media

లంఖంగా పాస్‌

ఇక్కడికి చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాను ఉత్తరాఖండ్‌లోని హార్షిల్‌ ప్రాంతాన్ని కలుపుతుంది. 

Image : Social media

 కైలాష్‌ మానస సరోవరం

పవిత్ర కైలాస పర్వతం, సరోవరం ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ప్రాంతం టిబెట్‌లో ఉంటుంది. యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కుమౌన్‌ డివిజన్‌ నుంచి బయలుదేరి లిపులేఖ్‌ పాస్‌ గుండా అక్కడికి చేరుకోవచ్చు.

Image : Rkc

ఎవరెస్ట్‌ గ్రీన్‌ లేక్‌ ట్రైల్‌ 

ఎవరెస్టు పర్వతారోహణ మార్గంలో గ్రీన్‌ లేక్‌ ట్రైల్‌ ఉంటుంది. ఇక్కడికి చేరుకునే మార్గం చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. మంచు జారుతూ ఇబ్బంది పెడుతుంది. 

Image : Social media

ఆడెన్స్‌ కోల్‌ పాస్‌

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ ప్రదేశం ఉంటుంది. రుడుగైరా వ్యాలీ, భిలాంగ్న వ్యాలీని ఇది కలుపుతుంది. చాలా ప్రమాదకరమైన దారిగా గుర్తింపు పొందింది. 

Image : thrillophilia

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home