డిప్రెషన్ గురించి.. దీపికా పదుకొణె ఏమందో తెలుసా?
బాలీవుడ్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.
Source:Instagram/Deepika Padukone
పదిహేనేళ్ల తన సినీ, వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన అనుభవాల్ని ఇటీవల గుర్తు చేసుకుంది. కెరీర్ పరంగా విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ గతంలో డిప్రెషన్ సమస్యతో బాధపడ్డానని చెప్పింది.
Source:Instagram/Deepika Padukone
ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. డిప్రెషన్ నుంచి కోలుకున్న తర్వాత ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థను స్థాపించి.. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.
Source:Instagram/Deepika Padukone
మానసిక కుంగుబాటు గురించి అనేక సందర్భాల్లో దీపిక తన అభిప్రాయాలను, అనుభవాలను వెల్లడించింది. డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరముందని తెలిపింది.
Source:Instagram/Deepika Padukone
‘‘బాధ, డిప్రెషన్ రెండు వేర్వేరు. ముఖంలో బాధ కనిపిస్తుంది. కానీ.. డిప్రెషన్ కనిపించదు. నా విషయానికొస్తే.. నువ్వో స్టార్ హీరోయిన్‌వి.. అన్నీ ఉన్నాయి. నువ్వు ఎందుకు డిప్రెషన్‌లో ఉంటావ్? అనేవాళ్లు’’ Source:Instagram/Deepika Padukone
అందరూ శారీరక దృఢత్వం గురించే మాట్లాడతారు.. కానీ మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే. ఎంతోమంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. వారికి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకే ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థను స్థాపించా.
Source:Instagram/Deepika Padukone
పగలు, ప్రతీకారాలు, ప్రతికూల అంశాల గురించి నేను ఆలోచించను. నన్ను ఎవరైన బాధపెట్టినా క్షమించి ఆ విషయాన్ని మర్చిపోతా. హాయిగా ఉండేందుకు ఇది సులభమైన మార్గం.
Source:Instagram/Deepika Padukone
గాయపడిన మనసును తిరిగి బలంగా చేసుకోవడానికి మీరు చేసే పనులు ఉపయోగపడతాయి. పరిస్థితుల గురించి ప్రశ్నించడానికి బదులు వాటిని అంగీకరించడం ఉత్తమం.
Source:Instagram/Deepika Padukone
నేను డిప్రెషన్‌తో పోరాటం చేశా. దాని గురించి ఇతరులకు అవగాహన కల్పించడం నాకు చాలా ముఖ్యం.
Source:Instagram/Deepika Padukone
డిప్రెషన్‌తో పోరాడే సమయంలో నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. నేను డిప్రెషన్‌లో ఉన్నట్లు మా అమ్మే గుర్తించింది. చికిత్సలో భాగంగా మందులు వాడతానన్న నా నిర్ణయానికి కుటుంబసభ్యులు, స్నేహితులు సపోర్ట్ చేశారు.
Source:Instagram/Deepika Padukone