‘అక్కడ అమ్మాయి’ దీపిక ఆసక్తులివే
ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది దీపిక పిల్లి. ఈ సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు.
దీపిక 1999లో విజయవాడలో పుట్టింది. పెరిగిందీ అక్కడే..డ్యాన్స్ అంటే ఇష్టం.
టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది.
ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షో ద్వారా 2021లో టీమ్‌లీడర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
‘సర్కార్’, ‘కామెడీ స్టార్స్ ధమాకా’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ వంటి షోస్‌లో యాంకర్, హోస్ట్‌గా చేసింది.
2022లో ‘వాంటెడ్ పండు గాడ్’లో నటించింది.
డ్రెస్ ఏదైనా రీల్ ముఖ్యం అంటుంది. ఆమె షార్ట్ వీడియోస్‌కి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్. ఇన్‌స్టా ఖాతాకి 21లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
నీలి రంగంటే ఇష్టం. ‘ఎలక్ట్రిక్ బ్లూస్.. సన్ సెట్ బీచెస్ ఆర్ లవ్లీ థింగ్స్’ అంటూ పోస్టులు పెడుతుంది.
పండుగలు ప్రత్యేక సందర్భాల్లో పట్టు పరికిణీలతో సందడి చేస్తుంది. దీపికకు పాములు అంటే ఫోబియా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఈమె పుస్తకాల పురుగు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడానికే కేటాయిస్తుంది.