బుల్లితెర బ్యూటీ.. వెండితెరపై ఎంట్రీ 

దీపికా పిల్లి.. బుల్లితెర ప్రేక్షకులకి, సోషల్ మీడియా యూజర్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.

Image:instagram/Deepika pilli

ఇన్నాళ్లు పలు టీవీ షోలతో అలరించిన ఈ బ్యూటీ తొలిసారి వెండితెరపై మెరవబోతోంది.

Image:instagram/Deepika pilli

దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో వస్తున్న ‘వాంటెడ్ పండుగాడ్‌’లో దీపిక నటించింది. బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్‌, సుధీర్‌, అనసూయ, విష్ణు ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలకానుంది.

Image:instagram/Deepika pilli 

దీపిక 1999 ఆగస్టు 15న విజయవాడలో జన్మించింది. అదే నగరంలోని కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసింది. అనంతరం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.

Image:instagram/Deepika pilli

దీపికకు చిన్నప్పట్నుంచే నటనంటే ఆసక్తి. అప్పట్లో సంచలనం సృష్టించిన ‘టిక్‌ టాక్‌’లో వీడియోలు చేస్తూ 10 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.

Image:instagram/Deepika pilli 

2020లో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ని బ్యాన్‌ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయడం మొదలు పెట్టి సోషల్‌ మీడియా క్వీన్‌గా మారింది.

Image:instagram/Deepika pilli

‘ఈ టీవీ’లో ప్రసారం అయిన ‘ఢీ 13 కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఛానల్‌లో కొన్నిస్పెషల్ ఈవెంట్లలోనూ మెరిసింది.

Image:instagram/Deepika pilli

ప్రస్తుతం స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్‌లో యాంకర్‌గా చేస్తోంది.

Image:instagram/Deepika pilli

సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

Image:instagram/Deepika pilli

ప్రస్తుతం ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:instagram/Deepika pilli

యూ ట్యూబ్‌లో దీపికా పిల్లి ఛానల్‌కి 1.02 లక్షల సబ్‌స్క్రైబర్లున్నారు.

Image:instagram/Deepika pilli

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు.. ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

Eenadu.net Home