షేక్ చేస్తున్న డీప్‌సీక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ డీప్‌సీక్ సరికొత్త సంచలనంగా మారింది. 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ దీన్ని స్థాపించారు.
చాట్‌జీపీటీకి పోటీగా ఆర్1 పేరిట ఈ సంస్థ ఆవిష్కరించిన కొత్త ఏఐ మోడల్.. కృత్రిమ మేధలో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.
పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ కోసం దాదాపు అన్ని సంస్థలూ డబ్బులు వసూలు చేస్తుంటే.. ఈ సంస్థ మాత్రం ఉచితంగా సేవలందిస్తోంది.
టెక్ దిగ్గజాలు ఏఐ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తుంటే డీప్‌సీక్ మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లతో లేటెస్ట్ ఏఐ మోడల్‌ను తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది.
దీని దెబ్బకు ఎన్విడియా, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లే కుదుపునకు లోనయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అంతేనా అనతికాలంలోనే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఓపెన్ఏఐ ఓ1 మోడల్‌తో పోలిస్తే మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్ వంటి అంశాల్లో సమానమైన పనితీరును కనబరుస్తోందంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
డీప్‌సీక్ పనితీరును ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ప్రశంసించారు. అమెరికా కంపెనీలకు ఇది ఒక మేల్కొలుపు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ ఏఐ మోడల్ చైనా సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.