#eenadu

ఓటమి శాశ్వతం కాదు. దాని వల్ల కలిగే బాధను కూడా క్రమంగా మర్చిపోతాం. కానీ ఓటమి తర్వాత తిరిగి ప్రయత్నించలేదన్న పశ్చాత్తాపం మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఓటమికి కుంగిపోయి మీ ప్రయత్నానికి ముగింపులా భావించకుండా విరామంగా పరిగణించి మళ్లీ ముందడుగు వేయండి.

దేశంలో మతం, కులం, జాతి, వర్గం, లింగం లాంటి గుర్తింపులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించడం అత్యంత అవసరం. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సులతో తమ జీవితాలను సుసంపన్నం చేసుకొనే అవకాశాన్ని పౌరులకు కల్పించడానికి, దేశాన్ని పటిష్ఠం చేయడానికి ఇదే కీలకం.

మీ కుటుంబం మీపై ఆధారపడి ఉంది. మీరు.. మీ ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదనపై ఆధారపడి ఉన్నారు. ఉద్యోగం, పదోన్నతులు మీకున్న నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు వృథా చేసే ప్రతి క్షణం పరోక్షంగా మీ కుటుంబానికి నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

యూట్యూబర్ల సలహాలను గుడ్డిగా అనుసరించొద్దు. నిజంగా వారికి ఆయా అంశాల్లో విషయ పరిజ్ఞానం ఉందా? వారికి ఉన్న విద్యార్హతలు, ప్రత్యేకతలేంటి? వారికి ఉన్న అనుభవమేంటి? వారు స్వయంగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నారా? అన్న విషయాలను ధ్రువీకరించుకోండి.

చాలా మంది అమ్మాయిలు తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనో లేదా ఇంట్లో వారిని బాధపెట్టడం ఇష్టం లేకనో తమకు ఎదురయ్యే వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పరు. ప్రతి తండ్రి వారిలో ఆ సంశయాన్ని పోగొట్టి భరోసాను నింపాలి.

పిల్లల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధ ఆలోచనలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. దీనివల్ల వారు పెద్దయ్యాక మూఢవిశ్వాసాలకు, అశాస్త్రీయ విధానాలకు దూరంగా ఉంటారు.

ఏ రంగంలో విజయం సాధించాలన్నా ప్రతిభ, నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. స్థిరత్వం అత్యంత కీలకం. స్థిరమైన ప్రయత్నాలు చేయకపోవడం వల్లే ఎంతో మంది ప్రతిభావంతులు తమ సామర్థ్యానికి తగ్గ స్థాయికి వెళ్లలేకపోతున్నారు. 

మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. దానిని కొనసాగించడానికి మీకు పట్టుదల, సహనం, క్రమశిక్షణ, ఆశావాదం ఉండాలి. కాలం గడిచేకొద్దీ మీరు కష్టమైన పనులను చేయడంలో బలంగా, మెరుగ్గా మారుతారు. 

నగరాలు, పట్టణాల్లో చెట్ల సంఖ్యను పెంచాలి. అవి ఉష్ణోగ్రతను 2-8 డిగ్రీల మేర చల్లబరుస్తాయి. వాతావరణ మార్పులను నివారించడంలో వృక్షాలు దోహదపడతాయి. చెట్ల దగ్గర సేదతీరితే ఒత్తిడి తగ్గి నూతనోత్తేజం కలుగుతుంది. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

సమోసాకీ ఓ రోజుంది!

బిర్యానీ రుచిగా రావాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..

ఉపాధ్యాయ దినోత్సవం(SEP 5).. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూక్తులు!

Eenadu.net Home