డీగ్లామర్‌ పాత్రలో అందాల భామలు!

కీర్తి సురేశ్‌

నాని హీరోగా నటించిన ‘దసరా’తాజాగా విడుదలైంది. ఇందులో కీర్తి సురేశ్‌ డీగ్లామరస్‌గా కనిపించింది. అంతకుముందు ‘చిన్ని’లోనూ ఊరమాస్‌ లుక్‌తో ఔరా అనిపించింది.

#Eenadu

సమంత

డీగ్లామరస్‌ పాత్ర రామలక్ష్మిగా ‘రంగస్థలం’లో సమంత నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’లోనూ కరుడుగట్టిన తీవ్రవాదిగా డీగ్లామర్‌తో కనిపించింది.

#Eenadu

రష్మిక మందనా

సుకుమార్‌-అల్లు అర్జున్‌ హిట్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’లో డీగ్లామరస్‌ పల్లెటూరు అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక ఆకట్టుకుంది. డీగ్లామరస్‌గా ఉన్నా.. ఈ చిత్రంతో నేషనల్‌ క్రష్‌గా మారింది రష్మిక.

#Eenadu

అనుష్క శెట్టి

‘బాహుబలి’లో అనుష్క.. వృద్ధురాలిగా డీగ్లామర్‌ రోల్‌ చేసింది. మాహిష్మతి రాజ్యంలో శిక్ష అనుభవిస్తుంటుంది. ‘సైజ్‌ జీరో’లో 20 కిలోల బరువు పెరిగి.. భారీకాయంతో నటించింది. 

#Eenadu

తమన్నా

‘బాహుబలి’లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ‘అవంతిక’పాత్రలో డీగ్లామర్‌గా కనిపించింది. ప్రభుదేవా ‘అభినేత్రి’లో తమన్నా ద్విపాత్రాభినయం చేయగా.. అందులో ఒక పాత్ర డీగ్లామర్‌ పల్లెటూరు అమ్మాయి. 

#Eenadu

ప్రియమణి

ఈ సీనియర్‌ హీరోయిన్‌ ‘పరుతివీరన్‌’లో డీగ్లామర్‌ రోల్‌ చేసింది. ఇది తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘విలన్‌’, ‘నారప్ప’, ‘విరాటపర్వం’ చిత్రాల్లోనూ డీగ్లామర్‌ పాత్రలే పోషించింది. 

#Eenadu

అమలాపాల్‌

‘నాయక్‌’, ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాల్లో మెరిసిన అమలాపాల్‌ తన కెరీర్‌ మొదట్లోనే ‘ప్రేమఖైదీ’లో డీగ్లామర్‌ పాత్ర పోషించింది. ఆ చిత్రం బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. 

#Eenadu

సంగీత

ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తున్న సీనియర్‌ హీరోయిన్‌ సంగీత కూడా డీగ్లామర్‌ రోల్‌ చేసింది. ‘శివపుత్రుడు’లో గంజాయి అమ్మే అమ్మాయిగా నటించింది.

#Eenadu

సింధూ తులాని

‘గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి’లో నటించిన సింధూ తులాని గ్లామర్‌కి అప్పటి యువత ఫిదా అయింది. అలాంటి హీరోయిన్‌ ‘బతుకమ్మ’ సినిమా కోసం డీగ్లామరస్‌గా కనిపించింది.

#Eenadu

నన్ను ఇంప్రెస్‌ చేయాలంటే ఫుడ్‌ ట్రక్‌ ఉండాలి!

ఈ భామలకు.. భలే క్రేజ్‌!

చమ్కీలా.. సుందరి

Eenadu.net Home